పోటాపోటీగా పూజలు ,యాగాలు.. బీజేపీ వర్సెస్ కాంగ్రెస్
దేశ వ్యాప్తంగా ప్రజల్లోనే కాదు రాజకీయ పార్టీల్లోనూ టెన్షన్ నెలకొంది. మొన్నటి వరకు హోరాహోరీగా ఎన్నికల్లో పోరాడిన పార్టీలు ఇప్పుడు ఎన్నికల ఫలితాల్లో విజయం సాధించాలని పూజలు,యాగాలలోనూ పోటీ పడుతున్నాయి. ఒకర్ని మించి ఒకరు పూజలు, యాగాలతో పార్టీ ఆఫీసుల ముందు అనుకూల ఫలితాల కోసం ప్రార్ధిస్తున్నారు.
లోక్ సభ ఎన్నికలు ఫలితాల కౌంటింగ్ ప్రారంభం అయ్యింది. ఫలితాల వేళ కాన్పూర్, ఢిల్లీ బీజేపీ పార్టీ ఆఫీస్‌ల ముందు పూజలు చేస్తున్నారు పార్టీ కార్యకర్తలు. తమ పార్టీ అధికారంలోకి రావాలనీ, మళ్లి నరేంద్ర మోదీ ప్రధాని అవ్వాలని యాగాలు చేస్తున్నారు. ఒక పక్క ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు బీజేపీ కి అనుకూలంగా ఉన్న నేపధ్యంలో మరో మారు కేంద్రం లో బీజేపీ సర్కార్ అధికారంలోకి వస్తుందని ధీమాతో ఉన్న పార్టీ శ్రేణులు బీజేపీ పార్టీ కార్యాలయాల ముందు పూజలు, యాగాలు చేస్తూ ఫలితాలు ఆశించిన విధంగా రావాలని కోరుకుంటున్నారు.

అటు లోక్ సభ ఫలితాలు పార్టీకి అనుకూలంగా రావాలనీ రాహుల్ గాంధీ ఇంటి ముందు యాగం చేస్తున్నారు పార్టీ కార్యకర్తలు. రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, రాబర్ట్ వాద్రా ఫోటోలను పెట్టి ఈవీఎంలకు పూజలు చేస్తూ , యాగం చేస్తూ పార్టీకి అనుకూల ఫలితాలు రావాలనీ ప్రార్థనలు చేశారు. దీనికి తోడు అక్కడికి వచ్చిన వారికి వేడివేడిగా రాఫెల్ టీని కూడా అందిస్తున్నారు.
-
పాతాళానికి పడిపోతున్న బంగారం ధరలు- భారీ క్రాష్ -
‘మన శంకర వరప్రసాద్ గారు’ ఫైనల్ కలెక్షన్స్.. అనుకున్నదొక్కటి.. -
రిటైర్మెంట్ పై సూర్య కుమార్ సంచలన ప్రకటన..!! -
ఆయన చలవ వల్లే- సక్సెస్ మంత్ర బయటపెట్టిన సంజు -
ఉగాది నుంచి కన్యారాశి, సింహరాశి వారి జాతక ఫలం -
నా దేవత- ఆమె రాకతోనే నా జీవితం ఇలా మారిపోయింది -
నిర్మలమ్మ వరాలు: మినిమం బ్యాంక్ బ్యాలెన్స్ పై సంచలన నిర్ణయం -
రోహిత్‌కు పెళ్లాం పోరు.. స్టేడియంలో డిష్యూం.. డిష్యూం! వీడియో -
మెగాస్టార్‌కి బహిరంగంగా క్షమాపణలు చెప్పిన సీఎం.. -
Viral Video: ఆ తొలి స్పర్శ, బిడ్డను ఎత్తుకోవడానికి వణికిపోయాడు -
విశాఖ టు బెంగళూరు వయా తిరుపతి వందేభారత్ స్లీపర్ రెడీ - రూట్ , ముహూర్తం..!! -
ఏపీలో భారీగా మద్యం ధరల తగ్గింపు, ఏ బ్రాండ్ ఎంత..!!












Click it and Unblock the Notifications