Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

బంపర్ఆఫర్: రెడ్‌మి4ఏ ఒక్కరూపాయికే, యాక్ససరీస్‌పై బారీ డిస్కౌంట్స్

ఎంఐ మ్యాక్స్ మూడవ వార్షికోత్సవాన్ని పురస్కరించుకొని ఈ నెల 20, 21 తేదిల్లో ఒక్క రూపాయికే ప్లాష్ సేల్‌ను అందించనున్నట్టు ఆ కంపెనీ ప్రకటించింది.కొత్తగా మార్కెట్‌లోకి విడుదల చేసిన రెడ్‌మి4 స్మార్ట్‌ఫోన్ల

న్యూఢిల్లీ:ఎంఐ మ్యాక్స్ మూడవ వార్షికోత్సవాన్ని పురస్కరించుకొని ఈ నెల 20, 21 తేదిల్లో ఒక్క రూపాయికే ప్లాష్ సేల్‌ను అందించనున్నట్టు ఆ కంపెనీ ప్రకటించింది.కొత్తగా మార్కెట్‌లోకి విడుదల చేసిన రెడ్‌మి4 స్మార్ట్‌ఫోన్లు, రెడ్‌మి నోట్4లు కూడ ఉన్నాయి.

ఎంఐమ్యాక్స్ 2ను షావోమి మంగళవారం నాడు భారత్ మార్కెట్లోకి విడుదల చేసింది. అదే సమయంలో తమ కంపెనీ మూడవ వార్షికోత్సవాన్ని పురస్కరించుకొని ప్రత్యేక ఆఫర్‌ను కూడ ప్రకటించింది ఆ కంపెనీ.ఈ నెల 20, 21 తేదిల్లో తమ యాక్ససరీస్‌పై బంపర్ డిస్కౌంట్లను ప్రకటించింది.
అంతేకాదు ఒక్కరూపాయికే ప్లాష్ సేల్‌ను అందించింది.

redmi 4 a smart phone one rupee flash sale

రెడ్‌మి4ఏ, వై-ఫై రిపీటర్ 2, 10,000 ఎంఏహెచ్ ఎంఐ పవర్ బ్యాంక్2లు ఒక్క రూపాయి ప్లాష్ సేల్‌లో అందుబాటులోకి ఉంచుతున్నట్టు షావోమి కంపెనీ ప్రకటించింది. గోయిబిబో ద్వారా దేశీయ హోటల్స్ బుకింగ్ చేసుకొనేవారికి రూ. 2000 తగ్గింపును షావోమి ప్రకటించింది. ఎస్‌బిఐ డెబిట్, క్రెడిట్ కార్డు హోల్డర్స్‌కు అదనంగా 5 శాతం క్యాష్‌బ్యాక్ ఆఫర్ ప్రకటించింది.

అంతేకాదు రూ.8వేల కంటే మించి లావాదేవీలు చేస్తే ఒక్కో కార్డుపై రూ.500 వరకు క్యాష్‌బ్యాక్‌ను ఇవ్వనున్నట్టు తెలిపింది.ఎంఐ మ్యాక్స్ 2 స్మార్ట్‌ఫోన్ ఈ నెల 20వ, తేది మధ్యాహ్నం అందుబాటులోకి రానుంది. అప్పటి నుండి స్టాక్స్ అయిపోయే వరకు దీన్ని విక్రయిస్తామని కంపెనీ ప్రకటించింది. రెడ్‌మి4, రెడ్‌మి నోట్4ఏ, స్మార్ట్‌ఫోన్లు కూడ ఈ రెండు రోజుల పాటు విక్రయించనున్నారు. యాక్ససరీస్‌పై రూ.300వరకు కంపెనీ డిస్కౌంట్ ఆఫర్ ప్రకటించింది.

రెడ్‌మి 4ఏ ఫోన్లు 10000 ఎంఏహెచ్ సామర్థ్యమున్న 25 పవర్ బ్యాంకులు, 15 వైఫై రిపీటర్ 2 యూనిట్లు ఒక్క రూపాయి ప్లాష్ సేల్ యూజర్లకు అందుబాటులో ఉంటాయి. ఈ రెండురోజుల పాటు ఉదయం 11 గంటలనుండి మధ్యాహ్నం 1 గంటవరకే నిర్వహించనున్నారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+