Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

యాకూబ్ మెమన్ కు జులై 30న ఉరి శిక్ష

ముంబై: ముంబై పేలుళ్ల నిందితుడు, ఉగ్రవాది యాకూబ్ మెమన్ (50) ను ఉరి తియ్యాలని మహారాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. టాడా కోర్టు యాకూబ్ మెమన్ కు విధించిన శిక్షను అమలు చెయ్యాలని ప్రభుత్వం ఒక నిర్ణయానికి వచ్చింది.

అందుకు తేదీని ఖరారు చేసింది. జులై 30వ తేదిన యాకూబ్ మెమన్ కు ఉరి శిక్ష అమలు చెయ్యాలని మహారాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని బుధవారం అధికారులు ఒక ప్రకటన విడుదల చేశారు. నాగ్ పూర్ సెంట్రల్ జైలులో యాకూబ్ ను ఉరి తీయ్యడానికి అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు.

1993 ముంబై పేలుళ్ల నిందితుడు యాకూబ్ పెట్టుకున్న క్షమాభిక్ష పిటిషన్ సుప్రీం కోర్టులో ఉంది. అయితే ధర్మాసనం ఈ పిటిషన్ ను విచారణకు స్వీకరిస్తే తదుపరి చర్య వాయిదా పడుతుంది. పిటిషన్ తిరస్కరిస్తే జులై 30వ తేదిన యాకూబ్ కు కచ్చితంగా ఉరి శిక్ష పడుతుంది.

1993 మార్చి 12వ తేదిన ముంబైలో వరుస బాంబు పేలుళ్లు జరిగాయి. ఈ దాడులలో 257 మంది మరణించి 700 మందికిపైగా తీవ్రగాయాలైనాయి. యాకూబ్ ముంబై పేలుళ్ల కుట్రదారుడు అని టాడా కోర్టు గుర్తించింది. 2007లో యాకూబ్ తో సహ 10 మంది నిందితులకు ఉరి శిక్ష విధిస్తూ టాడా కోర్టు తీర్పు చెప్పింది.

 Yakub Memon to be hanged on July 30 in Nagpur Central Jail

అయితే నిందితులు సుప్రీం కోర్టును ఆశ్రయించారు. 2013 మార్చి 21వ తేదిన సుప్రీం కోర్టు తుది తీర్పు వెల్లడించింది. యాకూబ్ కు ఉరి శిక్ష విధించింది. మిగిలిన 10 మందికి యావజ్జీవ కారాగార శిక్ష విధించింది. అప్పటి నుండి యాకూబ్ కు శిక్ష అమలు చెయ్యాలని ప్రభుత్వం భావిస్తున్నది.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+