వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

దేశ ప్రధానిగా ముస్లిం ఎన్నికైతే 40 శాతం హిందువులను చంపేస్తారు : యతి వివాదాస్పద వ్యాఖ్యలు

|
Google Oneindia TeluguNews

ఉత్తరప్రదేశ్ ఘజియాబాద్‌లోని దాస్నాదేవి ఆలయ ప్రధాన పూజారి యతి నర్సింగానంద్ మరో సారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. భారతదేశానికి ప్రధానిగా ముస్లిం వ్యక్తి ఎన్నికయితే హిందువుల మనుగడకే ప్రమాదమని కీలక వ్యాఖ్యలు చేశారు. ఢిల్లీలోని బురారీలో నిర్వహించిన "హిందూ మహాపంచాయత్" కార్యక్రమంలో ముస్లింలకు వ్యతిరేకంగా అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారు. హిందువులు ఆయుధాలు పట్టుకోవాలని అప్పుడు తమ భవిష్యత్తును కాపాడుకోగలరని సంచలన వ్యాఖ్యలు చేశారు. యతి చేసిన ఈ వ్యాఖ్యలు దేశ వ్యాప్తంగా తీవ్ర దుమారం రేపుతున్నాయి.

ప్రధానిగా ముస్లిం ఎన్నికైతే 50 శాతం హిందువులు ఇస్లాంలోకి..

భారత ప్రధానిగా ఓ ముస్లిం 2029లోనో, లేదంటే 2034లో, లేదా 2039లో ఎన్నిక కావొచ్చని యతి నర్సింగానంద్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఒకసారి ముస్లిం వ్యక్తి ప్రధాన మంత్రిగా ఎన్నికయితే ఆ తర్వాత వచ్చే 20 ఏళ్లలో 50 శాతం హిందువులను ఇస్లాంలోకి మారతారని పేర్కొన్నారు. మిగిలిన హిందువుల్లో 40 శాతం మందిని చంపేస్తారని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. మిగిలిన 10 శాతం మంది హిందువులు శరణార్థ శిబిరాల్లో నివసిస్తారని లేదా పొరుగు దేశాలకు వెళ్తారని చెప్పారు. ఇది హిందువుల యొక్క భవిష్యత్తు. అందుకే ఈ పరిస్థితి రాకుండా ఉండాలంటే హిందువులు ఆయుధాలు పట్టుకోవాలంటూ వ్యాఖ్యానించారు.

 హిందువులు ఆయుధాలు పట్టుకోవాలి..

హిందువులు ఆయుధాలు పట్టుకోవాలి..

పూజారి యతి నర్సింగానంద్ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలపై ముస్లిం సంఘాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. మరోవైపు ఈ కార్యక్రమాన్ని నిర్వహించేందుకు నిర్వహకులకు అనుమతి లేదని ఢిల్లీ పోలీసులు తెలిపారు. ఈ వెంట్ నిర్వహకుడిపై కేసు నమోదు చేసినట్లు చెప్పారు. ఉద్రేకపూరిత ప్రసంగానికి సంబంధించిన వీడియోను పరిశీలిస్తున్నామని వెల్లడించారు. మరో వైపు ఈ కార్యక్రమాన్ని కవర్ చేసేందుకు వెళ్లిన కొందరు జర్నలిస్టులపై దాడి జరిగిందని ఆరోపణలు వెల్లవెత్తుతున్నాయి. ముస్లిం వర్గానికి చెందిన ఇద్దరు జర్నలిస్టులపై కొంతమంది హిందువులు దాడిచేసినట్లు వారిని పోలీసులు కూడా ఆదుపులోకి తీసుకున్నట్లు ఓ విలేకరి ట్విటర్ పోస్ట్ చేశారు.

 యతి వ్యాఖ్యలపై ముస్లిం సంఘాలు సీరియస్

యతి వ్యాఖ్యలపై ముస్లిం సంఘాలు సీరియస్


తమకు జర్నలిస్టుల నుంచి ఫిర్యాదులు అందాయని, ఎఫ్ఐఆర్ కూడా నమోదు చేసినట్లు సీనియర్ పోలీసులు అధికారి తెలిపారు. వేధింపులు, గాయపరిచినందుకు ఐపిసి సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు వెల్లడించారు. గుర్తుతెలియని వ్యక్తుల కోసం గాలింపు చర్యలు చేపట్టినట్లు చెప్పారు. జర్నలిస్టులను అదుపులోకి తీసుకున్నట్లు వస్తున్న వార్తలను డిసిపి ఉషా రంగనాని ఖండించారు . జర్నలిస్టులను అదుపులోకి తీసుకోలేదని స్పష్టం చేశారు. మరోవైపు ముస్లింలను కించపరిచే విధంగా వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన యతిపై కేసు నమోదు చేసి, అరెస్ట్ చేయాలని ముస్లిం సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.

English summary
Hindus pick up weapons to prevent India from becoming a Muslim Prime Minister says Yati Narsinganand
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X