వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

Year Ender 2021: మోడీ, జగన్ లను నేలకు దింపిన ఏడాది-సాగుచట్టాలు,రాజధాని బిల్లులు వెనక్కి

|
Google Oneindia TeluguNews

ఈ ఏడాది ఆరంభంలో వ్యవసాయ చట్టాలపై ప్రధాని నరేంద్రమోడీ వైఖరి కానీ, ఏపీలో మూడు రాజధానుల బిల్లులపై వైఎస్ జగన్ వైఖరి కానీ గమనిస్తే వాటిని వీరిద్దరూ ఎంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారో ప్రత్యర్ధులకే కాదు సొంత పార్టీ నేతలకు సైతం అర్ధమైంది. కానీ ఏడాది చివర్లో వీరిద్దరూ ఈ రెండు అంశాలపై పూర్తిగా వెనక్కి తగ్గారు. దీంతో పార్లమెంటులో వ్యవసాయ చట్టాలు రద్దయ్యాయి. అలాగే ఏపీ అసెంబ్లీలో మూడు రాజధానుల బిల్లులు రద్దయ్యాయి. ఆ విధంగా బలమైన నేతలుగా పేరుతెచ్చుకున్న మోడీ, జగన్ ను ఈ ఏడాది నేలకు దింపింది.

Recommended Video

2021 Year Ender: Major Political Events In 2021 | 2021 Politics Recall | Oneindia Telugu
నరేంద్ర మోడీ, జగన్

నరేంద్ర మోడీ, జగన్

భారత్ లో ప్రస్తుతం అత్యంత భారీ మెజారిటీతో ప్రభుత్వాలు నడుపుతున్న నేతల్లో నరేంద్రమోడీ, వైఎస్ జగన్ ప్రథమ స్ధానంలో ఉన్నారు. పార్లమెంటుతో పాటు చట్టసభల్లో వీరు తెచ్చుకున్న మెజారిటీ ప్రత్యర్ధుల్ని సైతం కంటిమీద కునుకులేకుండా చేస్తోంది. ప్రజాస్వామ్య బద్ధంగా ప్రజల చేత ఎన్నికైన వీరిద్దరూ ప్రత్యర్ధులకు మాత్రం ముచ్చెమటలు పట్టిస్తున్నారు. దీంతో వీరిద్దరి పేరెత్తాలంటే ప్రత్యర్ధులు వణుకుతున్నారు. అంతే కాదు వీరు తీసుకుంటున్న నిర్ణయాలు అత్యంత వేగంగా శాసనాలుగా మారిపోతున్నాయి. దీంతో మోడీ, జగన్ ప్రత్యర్ధులకు కొరకరాని కొయ్యలుగా మారిపోయారు.

 వ్యవసాయ చట్టాల వివాదం

వ్యవసాయ చట్టాల వివాదం


మోడీ ప్రభుత్వం కేంద్రంలో అధికారంలోకి వచ్చి ఏడేళ్లు పూర్తయ్యాయి. మరో మూడేళ్లలో సార్వత్రిక ఎన్నికలు ఉన్నాయి. ఆ లోపే దేశంలో సంస్కరణల కోసం తీవ్రంగా ప్రయత్నిస్తోంది. అందులో భాగంగా తెరపైకి వచ్చిన వ్యవసాయ చట్టాలు రైతుల ఉసురుతీశాయి. వీటిని అమల్లోకి తీసుకురావడం ద్వారా దేశంలో కార్పోరేట్ వ్యవసాయాన్ని ప్రోత్సహించాలని కేంద్రం భావించింది. అయితే రైతులు మాత్రం మరోలా తలచారు దీంతో వ్యవసాయ చట్టాల పేరెత్తగానే రైతులు మండిపడటం మొదలైంది. పంజాబ్, హర్యానా, యూపీ, రాజస్తాన్, ఢిల్లీ వంటి వ్యవసాయాధారిత రాష్ట్రాల్లో వీటి ప్రభావం ఎక్కువగా కనిపించింది. ఇక్కడ రైతుల ఆందోళన కేంద్రానికి కంటిమీద కునుకులేకుండా చేసింది. వీరికి మద్దతిచ్చిన వారు సైతం కేంద్రానికి కంటగింపుగా మారిపోయారు. ఆ ఆందోళలనపై సోషల్ మీడియా ప్రచారం నేపథ్యంలో కేంద్రం ఐటీ చట్టాల్నే మార్చేసింది.

వ్యవసాయ చట్టాల రద్దు

వ్యవసాయ చట్టాల రద్దు

దేశవ్యాప్తంగా వ్యవసాయ చట్టాలపై వెల్లువెత్తిన నిరసనలు.. వచ్చే ఏడాది జరిగే ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో బీజేపీ కొంప ముంచబోతున్నాయనే సంకేతాలు ఎన్డీయే సర్కార్ ను కంటిమీద కునుకులేకుండా చేశాయి. దీంతో చేసేది లేక ఎన్డీయే సర్కార్ వెనక్కి తగ్గింది. ముందు ప్రధాని మోడీ మీడియా ముందుకు వచ్చి వ్యవసాయ చట్టాల్ని వెనక్కి తీసుకుంటామని చెప్పేశారు. అప్పటికీ రైతులకు నమ్మకం కుదరలేదు. ఆ తర్వాత కేంద్ర కేబినెట్ వ్వవసాయ చట్టాల రద్దును ఆమోదించింది. అనంతరం పార్లమెంటు శీతాకాల సమావేశాల తొలిరోజే కేంద్రం లోక్ సభ, రాజ్యసభలో వ్యవసాయ చట్టాల్ని రద్దు చేస్తూ బిల్లులు పెట్టి ఆమోదించింది. అనంతరం రాష్ట్రపతి ఆమోదం కూడా లభించడంతో నల్ల చట్టాలు రద్దయిపోయాయి.

 మూడు రాజధానుల బిల్లుల రద్దు

మూడు రాజధానుల బిల్లుల రద్దు

ఏపీలో మూడు రాజధానుల బిల్లుల విషయంలోనూ దాదాపు ఇదే పరిస్ధితి ఎదురైంది. రెండేళ్ల క్రితం రాష్ట్రంలో మూడు రాజధానులు ఏర్పాటు చేసేందుకు వీలుగా వైసీపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అనుకున్నదే తడవుగా అసెంబ్లీలో రెండుబిల్లులు ప్రవేశపెట్టి ఆమోదించింది. వాటికి గవర్నర్ ఆమోదం కూడా తీసుకుంది. అయితే న్యాయ ప్రక్రియలో మాత్రం చిక్కులు తప్పలేదు.మరోవైపు అమరావతి రైతులు తిరుపతి వరకూ పాదయాత్ర నిర్వహించి ప్రభుత్వంపై ఒత్తిడి పెంచారు. చివరికి సీఎం జగన్ అసెంబ్లీలో ఈ బిల్లులు వెనక్కి తీసుకుంటున్నట్లు ప్రకటించారు. అయితే త్వరలో మరో బిల్లు తెస్తామని చెప్పుకొచ్చారు.

మోడీ, జగన్ ను నేలకు దింపిన ప్రజాస్వామ్యం

మోడీ, జగన్ ను నేలకు దింపిన ప్రజాస్వామ్యం

గతంలో ప్రధాని మోడీ, ఏపీ సీఎం జగన్ ఓ నిర్ణయం తీసుకుంటే అందులో ఇక ఎలాంటి మార్పూ ఉండబోదని అంతా భావించేవారు. ఈ ఏడాది అక్టోబర్, నవంబర్ వరకూ ఇదే పరిస్ధితి. అయితే ప్రధాని మోడీ ఎప్పుడైతే వ్యవసాయ చట్టాల్ని వెనక్కి తీసుకుంటూ నిర్ణయం ప్రకటించారో అప్పుడే సీఎం జగన్ కూడా మూడు రాజధానులపై వెనక్కి తగ్గారు. ఎలాంటి భేషజాలకు పోకుండా ప్రజా వ్యతిరేకతను ఆమోదిస్తూ ఇరువురు నేతలు తమ నిర్ణయాల్ని వెనక్కి తీసుకున్నారు. అయితే ఇందులో జగన్ నిర్ణయం తాత్కాలికమే అని చెప్తున్నా భవిష్యత్ రాజకీయాలే ఇందుకు సమాధానం చెప్పాల్సి ఉంటుంది. ఈ మొత్తం ఎపిసోడ్ లో ప్రజలే, ప్రజాస్వామ్యమే అంతిమమన్న సత్యాన్ని ఇరువురు నేతలు గ్రహించారన్న వాదన వినిపించింది.

English summary
this year brought down strongest leaders like narendra modi and ys jagan with the repealment of farm laws and three capital bills.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X