Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

Year Ender 2023: ఈ ఏడాది సుప్రీంకోర్టు సంచలన తీర్పులు-ఆర్టికల్ 370 నుంచి నోట్ల రద్దు వరకూ..

ఈ ఏడాది భారత సుప్రీంకోర్టు పలు కీలక తీర్పులు వెలువరించింది. పలు అంశాలపై కేంద్రంతో అమీతుమీ అంటున్నా కీలక అంశాల్లో మాత్రం అత్యున్నత న్యాయస్ధానం నిర్మొహమాటంగా తన తీర్పులు ఇచ్చేసింది. ఇంకా పలు అంశాల్లో ప్రతిష్టంభన కొనసాగుతూనే ఉంది. ఈ ఏడాది సుప్రీంకోర్టు ప్రకటించిన తీర్పుల్లో పలు కేసులు ఎన్నో ఏళ్లుగా పెండింగ్ లో ఉన్నవే. తీర్పుల కోసం ఎదురూచూస్తున్నవే. వీటిపై సుప్రీంకోర్టు వెలువరించిన ఆదేశాలు దేశవ్యాప్తంగా భిన్న చర్చలకు కూడా దారి తీశాయి.

ఈ ఏడాది 2023 లో సుప్రీంకోర్టు వెలువరించిన ప్రధాన తీర్పుల్లో ఆర్టికల్ 370 రద్దు కూడా ఒకటి. జమ్మూకశ్మీర్ ను మూడు ముక్కలు చేయడాన్ని చట్టబద్ధమేనని సుప్రీంకోర్టు తేల్చిచెప్పేసింది. లడఖ్ ను కేంద్రపాలిత ప్రాంతంగా మార్చడాన్ని సమర్ధించిన సుప్రీంకోర్టు.. దాంతో పాటు జమ్మూకశ్మీర్ కు తిరిగి రాష్ట్ర హోదా ఇచ్చి ఎన్నికలు నిర్వహించాలని ఆదేశించింది.అలాగే 2017లో మోడీ సర్కార్ చేసిన నోట్ల రద్దును కూడా సమర్ధిస్తూ ఏడేళ్ల తర్వాత సుప్రీంకోర్టు తీర్పు వెలువరించింది.

Year Ender 2023: top judgements given by supreme court this year-from article 370 to demonitization

మరోవైపు సీఈసీ, ఈసీ ల నియామకానికి సుప్రీంకోర్టు త్రిసభ్య కమిటీని నియమిస్తూ మరో కీలక ఆదేశం ఇచ్చింది. అయితే ఈసీల నియామక కమిటీలో సీజేఐ స్థానంలో కేబినెట్‌ మంత్రిని చేరుస్తూ కేంద్ర ప్రభుత్వం పార్లమెంటులో బిల్లు తెచ్చింది. అటు ఈ ఏడాది దేశాన్ని కుదిపేసిన అదానీ గ్రూప్ పై హిండెన్ బర్గ్ రిపోర్టు పైనా సుప్రీం కీలక తీర్పు ఇచ్చింది. ఓ విదేశీ రిపోర్ట్‌ ఆధారంగా దేశంలో పెద్ద సంస్థపై చర్యలు సరి కాదని తెలిపింది.

అలాగే దేశంలో ఓ వర్గం లక్ష్యంగా జరుగుతున్న విద్వేష పూరిత ప్రసంగాలను తీవ్రమైన నేరంగా సుప్రీంకోర్టు పేర్కొంది. ఇలాంటి విద్వేష ప్రసంగాలపై కఠిన చర్యలు చేపట్టాలని ప్రభుత్వానికి ఆదేశాలు. మరోవైపు భార్యాభర్తలు ఇద్దరూ ఆసక్తి చూపితే వెంటనే విడాకులు మంజూరు చేయాలని సుప్రీంకోర్టు మరో ఆదేశం ఇచ్చింది. అటు స్వలింగ వివాహాలకు చట్టబద్ధత కల్పించేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. దీనిపై 3-2 తేడాతో రాజ్యాంగ ధర్మాసనం తీర్పు వెలువరించింది. మరోవైపు జల్లికట్టు వంటి సంప్రదాయ క్రీడలను అడ్డుకోలేమని సుప్రీంకోర్టు మరో తీర్పులో స్పష్టం చేసింది.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+