శాఖాహరమంటేనే ఇష్టం, ప్రతి రోజూ కొత్తదనమే: మోడీ

Posted By:
Subscribe to Oneindia Telugu

న్యూఢిల్లీ:ప్రతి రోజూ యోగా చేయడం, శాఖాహరం భుజించడం తనకు ఇష్టమని ప్రధానమంత్రి నరేంద్రమోడీ చెప్పారు. విదేశీ పర్యటనలో ఉన్న భారత ప్రధాన మంత్రి మోడీ గల్ప్ ఎక్స్‌ప్రెస్ న్యూస్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో తన అభిరుచులను ప్రకటించారు.

ప్రస్తుతం భారత ప్రధానమంత్రి విదేశీ పర్యటనలో ఉన్నారు. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌ పర్యటనలో మోడీ ఉన్న సమయంలో గల్ప్ ఎక్స్‌ప్రెస్ న్యూస్ మెయిల్ ద్వారా మోడీని ఇంటర్వ్యూ చేసింది.

ఈ ఇంటర్వ్యూలో తన అభిరుచులను మోడీ ప్రస్తావించారు. విదేశీ పర్యటనల సందర్భంగా తనకు ఆతిథ్యం ఇచ్చేవారు అందించే భోజనాన్ని సంతోషంగా స్వీకరించనున్నట్టు మోడీ ఆ ఇంటర్వ్యూలో చెప్పారు.

గతంలో తాను ముఖ్యమంత్రిగా ,కానీ, ప్రస్తుతం ప్రధానమంత్రిగా పనిచేసే సమయంలో ఏనాడూ కూడ సెలవును కోరుకోలేదన్నారు.దేశ వ్యాప్తంగా పర్యటించి ప్రజల కష్ట సుఖాలు తెలుసుకోవడం తనకు ఇష్టమని మోడీ చెప్పారు.

2001లో గుజరాత్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఎన్నికైనట్టు మోడీ గుర్తు చేసుకొన్నారు. కానీ అప్పటికే దేశంలో ప్రతి జిల్లాలో తాను పర్యటించినట్టు చెప్పారు.

Yoga, Simple Veg Meal, PM Shares Favourite Things In Interview: Report

విదేశీ పర్యటనల సమయంలో అతిథ్యం అందించే దేశాధినేతలు ఇచ్చే విందును తాను స్వీకరిస్తానని మోడీ చెప్పారు. తన వెంట ప్రత్యేకమైన వంటవాళ్ళు ఉండరని మోడీ చెప్పారు.

ఉదయం పూట కొద్దిసేపు యోగా చేస్తానని మోడీ చెప్పారు. ఆ తర్వాత వార్తాపత్రికలను చదువుతానని మోడీ చెప్పారు. అదే సమయంలో తనకు వచ్చిన మెయిల్స్ చూసి వాటికి సమాధానం ఇస్తానని మోడీ చెప్పారు.అంతేకాదు తాను ఆ సమయంలో ఫోన్లలో ఆ రోజు కార్యక్రమాల గురించి, పార్టీ, ప్రభుత్వ వ్యవహరాలపై చర్చించనున్నట్టు మోడీ ఆ ఇంటర్వ్యూలో చెప్పారు.

నిద్రపోయే ముందుకు ఆ రోజు కార్యక్రమాలకు సంబంధించిన డాక్యుమెంట్లను పరిశీలిస్తానని చెప్పారు. అంతేకాదు మరుసటి రోజు కార్యక్రమాలకు ప్రిపేర్ అవుతానని ఆయన చెప్పారు.

ప్రతి రోజూ నాలుగు నుండి ఆరు గంటల పాటు తాను నిద్రపోతానని మోడీ చెప్పారు. ప్రతి రోజూ ఉదయాన్ని కొత్తదనంతో ఆహ్వనిస్తానని మోడీ తెలిపారు. నిద్రపోయే సమయంలో తనకు ఎలాంటి ఆందోళన ఉండదన్నారు.శాఖాహరమంటే తనకు ఇష్టమని మోడీ చెప్పారు.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Prime Minister Narendra Modi doesn't travel abroad with a cook and "happily eats" everything offered by his hosts, reveals Gulf News Xpress, which emailed him questions ahead of his visit to the United Arab Emirates.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి