బిజెపి స్క్రిప్ట్, హర్ష చెప్పిందే: బిన్నీపై కేజ్రీవాల్‌పార్టీ రివర్స్
న్యూఢిల్లీ: ప్రభుత్వం పైన, పార్టీ నేత అరవింద్ కేజ్రీవాల్ పైన సొంత పార్టీకి చెందిన ఎమ్మెల్యే వినోద్ కుమార్ బిన్నీ చేసిన వ్యాఖ్యల పట్ల ఆమ్ ఆద్మీ పార్టీ (ఎఎపి) నేత యోగేంద్ర యాదవ్ గురువారం స్పందించారు. బిన్నీ వ్యాఖ్యలు విచారకరమన్నారు. పార్టీ సమావేశాల్లోనే ఆయన ఎందుకు మాట్లాడలేదని ప్రశ్నించారు.
ఆయన ఏ ఉద్దేశ్యంతో ఆరోపణలు చేశారో చెప్పాలన్నారు. అధికారంలోకి రాగానే ఎఎపి ప్రభుత్వం విద్యుత్ ధరలను తగ్గించిందన్నారు. భారతీయ జనతా పార్టీ స్క్రిప్ట్, హర్షవర్ధన్ ఆరోపణలను బిన్నీ విప్పుతున్నారన్నారు. నేరుగా మీడియా ఎదుట మాట్లాడటం ఏమిటో చెప్పాలన్నారు. కాగా, బిన్నీకి ఎఎపి షోకాజ్ నోటీసు జారీ చేసినట్లుగా తెలుస్తోంది.

అంతకుముందు వినోద్ కుమార్ బిన్నీ ప్రభుత్వంపై, కేజ్రీవాల్ పైన విరుచుకు పడ్డ విషయం తెలిసిందే. ఢిల్లీలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో బిన్నీ మాట్లాడారు. ఆ ప్రభుత్వం చెప్పేదొకటి.. చేసేదొకటి అని ధ్వజమెత్తారు. ఎవరినో ఎమ్మెల్యేలుగానే, పార్లమెంటు సభ్యులుగానో చేసేందుకు ఎఎపి పుట్టుకు రాలేదన్నారు. అవినీతి వ్యతిరేక ఉద్యమంలో భాగంగా ఈ పార్టీ ఏర్పాటయిందని గుర్తు చేసారు. విద్యుత్, తాగునీటికి సంబంధించిన హామీలను పూర్తిగా అమలు చేయలేకపోయిందని ఆయన విమర్శించారు.
ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను ఎఎపి ప్రభుత్వం నెరవేర్చలేకపోయిందన్నారు. కేజ్రీవాల్ చెప్పేది ఒకటి.. చేసేది ఒకటిగా ఉందన్నారు. హామీల అమలును కేజ్రీవాల్ పట్టించుకునే పరిస్థితులు కనిపించడం లేదన్నారు. హామీల అమలులో ఆయన వెనుకడుగు వేస్తున్నారని, మేనిఫెస్టోలో అమలు కాని హామీలు ఉన్నాయన్నారు. డెన్మార్క్ మహిళ అత్యాచార ఘటనపై ప్రభుత్వం ఎందుకు స్పందించడం లేదో చెప్పాలని నిలదీశారు. కాంగ్రెసు ఆడిస్తున్నట్లు ఎఎపి ఆడుతోందన్నారు.
డ్రేవింగ్ తెలియని డ్రైవర్: సల్మాన్ ఖుర్షీద్
ఆమ్ ఆద్మీ పార్టీ కన్వీనర్ ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ డ్రైవింగ్ తెలియని డ్రైవర్ అని కేంద్రమంత్రి సల్మాన్ ఖుర్షీద్ అన్నారు. ఎఎపికి సిద్ధాంతాలు లేవని మండిపడ్డారు.












Click it and Unblock the Notifications