Yogi Adityanath : నేరస్తులకు హారతి పట్టాలా ? బుల్ డోజర్ యాక్షన్ పై యోగీ కామెంట్స్..
ఉత్తర్ ప్రదేశ్ లో ఆరేళ్ల క్రితం తొలిసారి అధికారం చేపట్టిన తర్వాత శాంతి భద్రతలపై పూర్తిగా దృష్టిపెట్టిన సీఎం యోగీ ఆదిత్యనాథ్.. అప్పటి నుంచి నేరస్తుల భరతం పడుతున్నారు. ముఖ్యంగా భారీ ఎత్తున ఎన్ కౌంటర్లతో నేరస్తులను బెంబేలెత్తిస్తున్న యోగీ ఆదిత్యనాథ్.. పలు సందర్భాల్లో వారి ఇళ్లను కూడా బుల్ డోజర్లను పంపి కూల్చేస్తున్నారు. ఈ చర్యలపై విమర్శలు వెల్లువెత్తాయి. దీంతో యోగీ తాజాగా దీనిపై వివరణ ఇచ్చారు.
నేరస్తుల ఇళ్లను బుల్ డోజర్లతో కూల్చివేయడాన్ని యూపీ సీఎం యోగీ ఆదిత్యనాథ్ సమర్ధించుకున్నారు. అభివృద్ధి పథంలో ఎవరైనా అడ్డంకులు సృష్టిస్తే, వెంటనే చర్యలు తీసుకోవాలని ఆదేశాలు ఇచ్చినట్లు ఆయన తెలిపారు. రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడానికి బుల్‌డోజర్‌లు, ఆధునిక యంత్రాలు అవసరమని కీలక వ్యాఖ్యలు చేశారు. ఉత్తరప్రదేశ్ లాంటి భారీ రాష్ట్రం వేగంగా అభివృద్ధి చెందాలంటే నేటి కాలంలో గడ్డపారలు కావాలా.. ఇంతకుముందు ఏదైనా పని ఆమోదం పొందితే మాఫియా వచ్చి అక్రమ ఆస్తులు లాక్కునేది.. గత ప్రభుత్వాలు వారిపై చర్యలు తీసుకునే సాహసం చేయలేదన్నారు.

తమ ప్రభుత్వం బుల్‌డోజర్‌లతో నేరస్తుల ఇళ్లను ఎందుకు కూల్చివేస్తోందని అడిగిన ప్రశ్నకు ముఖ్యమంత్రి బదులిస్తూ.. 'అక్రమంగా ప్రభుత్వ ఆస్తులను లాక్కున్న వారికి నేను హారతి ఇవ్వాలా అని ప్రశ్నించారు. నేరస్తులు, మాఫియాపై చర్యలు తీసుకోవాలని ఉత్తరప్రదేశ్ ప్రజలు కోరుకుంటున్నారని సమాధానమిచ్చారు. తమ ప్రభుత్వం కేవలం మైనారిటీ వర్గాలకు చెందిన నేరస్తులను మాత్రమే లక్ష్యంగా చేసుకుంటోందన్న ఆరోపణలను కూడా ఆయన తోసిపుచ్చారు.
యూపీలో ఓ అమాయక ముస్లిం వచ్చి తనకు అన్యాయం జరుగుతోందని చెప్పమనండి అని యోగీ ఆదిత్యనాథ్ సవాల్ విసిరారు. అలాగే అన్నింటికంటే ఎక్కువగా వారందరికీ కోర్టు ఉందన్నారు. మతంతో సంబంధం లేకుండా చట్టబద్ధమైన పాలన అందరికీ సమానమని, రాష్ట్ర ప్రజలకు భద్రత కల్పించాలని ఆదిత్యనాథ్ అన్నారు.
-
వేసవిలో వాకింగ్ ఎవరికి ఏ సమయంలో మంచిది- ఈ జాగ్రత్తలు తప్పనిసరి..!! -
అమెరికాకు షాక్, రష్యా నుంచి 60 మిలియన్ బ్యారెళ్ల చమురు! -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
లోకసభ, అసెంబ్లీ స్థానాల పెంపు - ఏపీ..తెలంగాణలో పెరిగేది ఇలా, మహిళల స్థానాలు ఇవే..!! -
PM Modi: ఇరాన్ వార్ తో మనకు కష్టాలే..! సిద్ధంగా ఉండాలన్న మోడీ..! -
కొత్త సినిమాలపై పవన్ కల్యాణ్ సంచలన నిర్ణయం, ఇక నుంచి..!! -
రైతు రుణమాఫీ లేదు.. తేల్చి చెప్పిన నిర్మలమ్మ! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
టీడీపీ కంచుకోటలో వైసీపీ అభ్యర్ధి ఫిక్స్, 2024 నిర్ణయాల దిద్దుబాటు..!!











Click it and Unblock the Notifications