Yogi Adityanath : ఇక యూపీ జైళ్లలో పెను మార్పులు- యోగీ ఆదిత్యనాథ్ కీలక నిర్ణయం..
యూపీలో వరుసగా రెండోసారి అధికారంలోకి వచ్చాక పలు విప్లవాత్మక నిర్ణయాలు తీసుకుంటున్న సీఎం యోగీ ఆదిత్యనాథ్ రాష్ట్రంలో శాంతిభద్రతలతో పాటు నేరస్తుల విషయంలోనూ కఠినంగా వ్యవహరిస్తున్నారు. ఇదే క్రమంలో యోగీ తాజాగా మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. ముఖ్యంగా నేరస్తులతో యూపీ జైళ్లు నింపేస్తున్న యోగీ.. ఇప్పుడు వాటి విషయంలో మరో నిర్ణయం తీసుకున్నారు. తాజాగా జరిగిన జైళ్ల శాఖ సమీక్షలో యోగీ కీలక ఆదేశాలు ఇచ్చారు.
ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ గురువారం జరిగిన ఉన్నత స్థాయి సమావేశంలో జైళ్ల పరిస్థితిని సమీక్షించారు. జైళ్లలో చేపట్టాల్సిన సంస్కరణలకు సంబంధించి రోడ్ మ్యాప్ ఇచ్చారు. జైళ్లను 'సుధార్ ఘర్' (సంస్కరణ గృహాలు)గా మార్చాల్సిన అవసరాన్ని అధికారులకు గుర్తుచేశారు. అలాగే రాష్ట్ర కొత్త జైలు చట్టం తయారీకి సంబంధించి ఆదేశాలు జారీ చేసినట్లు ప్రభుత్వం ఓ అధికారిక ప్రకటనలో తెలిపింది.

యూపీలో జైళ్లను సంస్కరణ కేంద్రాలుగా మార్చాలని, ఇందుకోసం అవసరమైన ప్రతి చర్యా తీసుకోవాలని యోగీ ఆదిత్యనాథ్ అధికారుల్ని ఆదేశించారు. ఖైదీల భద్రత అంచనా, ఫిర్యాదుల పరిష్కారం, జైలు అభివృద్ధి మండలి, ఖైదీల పట్ల ప్రవర్తనలో మార్పు, మహిళా ఖైదీలకు, ట్రాన్స్ జెండర్లకు ప్రత్యేక వసతి కల్పించడం వంటి ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు.
ప్రస్తుతం జైళ్లలో పెడుతున్న ఖైదీలకు 1894 జైళ్ల చట్టం, 1900 నాటి ఖైదీల చట్టం అమలు చేస్తున్నారు. ఈ రెండు చట్టాలు స్వాతంత్య్రానికి పూర్వం నుండి అమల్లో ఉన్నాయి. ఇవి మారుతున్న పరిస్ధితులకు అనుగుణంగా లేవన్నారు.
ముఖ్యంగా 1894 నాటి జైళ్ల చట్టం లక్ష్యం నిర్బంధంలో ఉన్న నేరస్థులపై క్రమశిక్షణ, నియంత్రణను కొనసాగించడం, అయితే యూపీ సర్కార్ సంస్కరణ, పునరావాసంపై దృష్టి పెట్టాలని యోగీ ఆదేశించారు. భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని కొత్త చట్టాలను అమలు చేయడం తక్షణావసరమని యోగీ వెల్లడించారు. తాజాగా కేంద్రం మోడల్ జైలు చట్టం -2023ని ఇటీవల రూపొందించింది. ఖైదీల సంస్కరణ, పునరావాసం దృష్ట్యా ఈ మోడల్ చట్టం చాలా ఉపయోగకరంగా ఉందని యోగీ తెలిపారు.
దీని ప్రకారం రాష్ట్ర అవసరాలను దృష్టిలో ఉంచుకుని రాష్ట్రంలో కొత్త జైలు చట్టం తయారుచేయాలని నిర్ణయించారు.
ఈ మేరకు కొత్త జైలు మాన్యువల్‌కు యూపీ మంత్రివర్గం ఇటీవల ఆమోదం తెలిపింది. జైలు సంస్కరణల్లో భాగంగా ఇదో గొప్పప్రయత్నమని యోగీ ఆదిత్యనాథ్ తెలిపారు. జైళ్లను పునరావాసానికి మెరుగైన కేంద్రాలుగా ఏర్పాటు చేసేందుకు గట్టి కృషి చేయాలని అధికారుల్ని యోగీ కోరారు. ఈ దిశలో "ఓపెన్ జైలు" ఏర్పాటు ప్రయోగం కూడా ప్రయోజనకరంగా ఉంటుందన్నారు. ప్రస్తుతం లక్నోలో సెమీ ఓపెన్ జైలు మాత్రమే ఉంది.
-
అతిపెద్ద నిర్ణయాన్ని తీసుకోబోతున్నాం- తేల్చి చెప్పిన ప్రధాని మోదీ -
కటౌట్ కు తగ్గ పర్ఫెక్ట్ ఫిల్మ్- టైటిల్ గూస్ బంప్స్: విజువల్ వండర్ -
AP Inter Results: ఏపీలో ఇంటర్ ఫలితాల ముహూర్తం ఫిక్స్, అఫీషియల్..!! -
పాకిస్థాన్ కు ఎగిరి గంతేసే వార్త.. ఒకేసారి రూ. 41,500 కోట్లు సాయం అందింది..!! -
కెరీర్ లోనే ఫస్ట్ ప్లాఫ్.. ఎలా తట్టుకుంటున్నావ్ అన్నా..!! -
రాజ్యసభకు టీడీపీ, బీజేపీ నుంచి ఊహించని అభ్యర్దులు- జనసేన నుంచి ఆయనే..!! -
వాస్తు ప్రకారం ఏ రాశివారికి ఏ దిక్కులో ఉండే ఇళ్లు కలిసివస్తాయి? -
వారి గ్రీన్ కార్డులు అవుట్ -
US Visa: స్లాట్లు ఓపెన్. కానీ ప్రయాణం సేఫ్ కాదు! -
సీనియర్ ఎన్టీఆర్‌కు బాగా ఇష్టమైన చిరంజీవి సినిమా -
కలియుగ వైకుంఠంలో అద్భుతం; తిరుమల చరిత్రలో తొలిసారి.. -
ఒంటి పూట బడుల వేళల్లో మార్పు, ఇక నుంచి..!?












Click it and Unblock the Notifications