ఢిల్లీలో ప్రధాని మోడీ, నడ్డాతో రేపు యోగి ఆదిత్యనాథ్ భేటీ; ప్రమాణ స్వీకారం అప్పుడేనట!!
రెండో సారి యూపీ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చెయ్యనున్న యోగి ఆదిత్యనాథ్ రేపు న్యూఢిల్లీలో ప్రధాని నరేంద్ర మోదీ, బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డాతో భేటీ కానున్నారు. నివేదికల ప్రకారం, హోలీ తర్వాత కొత్త ప్రభుత్వ ప్రమాణ స్వీకార కార్యక్రమం జరిగే అవకాశం ఉన్నట్టు విశ్వసనీయ సమాచారం.

హోలీ ముందే అనుకున్నా మళ్ళీ ప్రమాణస్వీకార ముహూర్తం చేంజ్
దేశంలోనే అతిపెద్ద రాష్ట్రమైన ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలో వరుసగా రెండోసారి భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఏర్పాటు కానుంది. అసెంబ్లీ ఎన్నికల్లో తిరుగులేని మెజారిటీతో ఘన విజయాన్ని సాధించిన తర్వాత ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి అవసరమైన చర్యలపై దృష్టి సారించింది కాషాయ దండు. ముఖ్యమంత్రి, ఇతర మంత్రుల ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ముహూర్తాలను చూసుకున్నారు కూడా. హోలీ కంటే ఈ కార్యక్రమాన్ని నిర్వహించాలని నిర్ణయించారు కానీ హోలీ తర్వాత కొత్త ప్రభుత్వ ప్రామాణ స్వీకారం జరిగే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది.

మోడీని, జేపీ నడ్డాను కలవనున్న యోగి ఆదిత్యనాథ్
యోగి శుక్రవారం రాజ్‌భవన్‌లో గవర్నర్ ఆనందీబెన్ పటేల్‌ను కలిసి తన రాజీనామాను ఆమెకు అందజేసి కొత్త ప్రభుత్వ ఏర్పాటుకు మార్గం సుగమం చేశారు. గవర్నర్ ఆదిత్యనాథ్ రాజీనామాను ఆమోదించారు మరియు తదుపరి ఏర్పాట్లు జరిగే వరకు తన మంత్రివర్గంతో పాటు తాత్కాలిక ముఖ్యమంత్రిగా కొనసాగాలని అభ్యర్థించారు. ప్రస్తుత మైనా తాత్కాలిక ముఖ్యమంత్రిగా కొనసాగుతున్నారు. త్వరలో కొత్త ప్రభుత్వం ప్రమాణ స్వీకార కార్యక్రమం జరగనున్న నేపథ్యంలో యోగి ప్రధాని మోడీని, బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డాను కలిసి వారితో పలు అంశాలపై చర్చించనున్నారు.

యోగి కొత్త టీమ్ పై ఆసక్తికర చర్చ
మంత్రివర్గంలో ఎవరికి స్థానం దొరుకుతుంది అన్నది ఆసక్తికరంగా మారింది. అయితే ఈ దఫా కొత్త టీమ్ లో ప్రముఖ ముఖాలకు కీలక పాత్రలు లభించవచ్చునని తెలుస్తుంది .డిప్యూటీ సీఎంల నియామకంపై ఊహాగానాలు వెల్లువగా మారాయి. రాష్ట్ర స్థాయిలో బీజేపీ సంస్థాగత కమాండ్‌లో సాధ్యమయ్యే మార్పులపై పార్టీలోనూ అంతర్గతంగా చర్చ సాగుతుంది.
రాజకీయంగా ముఖ్యమైన ఎన్నికల విజయం తర్వాత పార్టీ క్యాడర్‌కు విస్తృత సందేశాన్ని పంపడానికి తగిన విధంగా పార్టీలో మార్పులు జరగనున్నాయని తెలుస్తుంది. పార్టీ కోసం పని చేసిన వారికి పట్టం కట్టే అవకాశం ఉందని, పార్టీ గెలుపులో కీలకంగా వ్యవహరించిన వారిని గుర్తించే అవకాశం ఉందని సమాచారం.

యూపీలో అధికారం దక్కించుకున్న బీజేపీ
ఉత్తరప్రదేశ్‌లో బీజేపీ 255 అసెంబ్లీ స్థానాలను గెలుచుకుంది. దాని మిత్రపక్షాలు అప్నా దళ్ (ఎస్) మరియు నిషాద్ పార్టీ వరుసగా 12 సీట్లు మరియు ఆరు సీట్లు గెలుచుకున్నాయి. సమాజ్‌వాదీ పార్టీ 111 సీట్లు గెలుచుకోగా, దాని కూటమి భాగస్వాములైన సుహెల్‌దేవ్ భారతీయ సమాజ్ పార్టీ మరియు రాష్ట్రీయ లోక్‌దళ్ వరుసగా ఆరు మరియు ఎనిమిది స్థానాలను గెలుచుకున్నాయి.కాంగ్రెస్, జనసత్తాదళ్‌లకు చెరో రెండు సీట్లు రాగా, బహుజన్ సమాజ్ పార్టీకి ఒక్క సీటు దక్కింది.
Recommended Video

పూర్తి పదవీకాలం పూర్తయిన తర్వాత అధికారాన్ని నిలబెట్టుకున్న మొదటి యుపి సిఎంగా చరిత్ర
యూపీలో ఘన విజయం సాధించి మళ్లీ అధికారాన్ని చేజిక్కించుకున్న యోగి ఆదిత్యనాథ్ 37 ఏళ్లలో పూర్తి పదవీకాలం పూర్తయిన తర్వాత అధికారాన్ని నిలబెట్టుకున్న మొదటి యుపి సిఎంగా చరిత్ర సృష్టించారు. యోగి ఆదిత్యనాథ్ గోరఖ్‌పూర్ అర్బన్ నియోజకవర్గం నుండి 1,03,390 ఓట్ల అత్యధిక ఆధిక్యతతో సమాజ్‌వాదీ పార్టీ అభ్యర్థి సుభావతి ఉపేంద్ర దత్ శుక్లాను ఓడించి తన మొట్టమొదటి అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపొందాడు.












Click it and Unblock the Notifications