మోడి మోసం చేశారు: యూత్ కాంగ్రెస్(పిక్చర్స్)
బెంగళూరు: లోక్ సభ ఎన్నికల సందర్బంలో నరేంద్ర మోడి అపద్దాలు చెప్పి అధికారంలోకి వచ్చారని, ఆయన ఇచ్చిన హామిలు గాలిలో కలిసిపోయాయని కాంగ్రెస్ నాయకులు ఆరోపించారు. విదేశాలలో ఉన్న నల్లధనాన్ని భారత్ కు తీసుకు వచ్చి ప్రతి ఒక్కరి ఖాతాలో రూ. 15 లక్షలు జమ చేస్తానని ప్రజలను మోసం చేశాడని కాంగ్రెస్ నాయకులు ఆరోపించారు.
అధికారంలోకి వచ్చిన వంద రోజులకే నల్లధనం తెస్తామని చెప్పిన నరేంద్ర మోడి 10 నెలలు అయినా ఎందుకు మౌనంగా ఉన్నారని ప్రశ్నించారు. విదేశాలలో రూ. 90 వేల కోట్ల బ్లాక్ మని ఉందని దానిని భారత్ కు తీసుకు వస్తామని స్వయంగా నరేంద్ర మోడి చెప్పారని కాంగ్రెస్ నాయకులు గుర్తు చేశారు.
బెంగళూరు నగరంలోని రేస్ కోర్స్ రోడ్డులోని ఆనందరావ్ సర్కిల్ లో ఉన్న కాంగ్రెస్ భవన్ లో యూత్ కాంగ్రెస్ యువజన విభాగం కర్ణాటక రాష్ట్ర అధ్యక్షుడు రిజ్వాన్ అర్షద్ ఆద్వర్యంలో ధర్నా నిర్వహించారు. నరేంద్ర మోడి సంతకాలు చేసిన చెక్ లు (కాంగ్రెస్ నాయకులు ముద్రించిన కాగితాలు) కార్యకర్తలకు పంపిణి చేశారు.
తరువాత బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశం జరుగుతున్న అశోక్ హోటల్ లో ఉన్న నరేంద్ర మోడిని కలిసి వినతి పత్రం అందివ్వడానికి ర్యాలిగా బయలుదేరారు. మార్గం మధ్యంలో కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలను పోలీసులు అరెస్టు చేశారు.

బీజేపీ మోసం చేసింది
అధికారంలోకి వచ్చిన వంద రోజులలో విదేశాలలో ఉన్న బ్లాక్ మని తీసుకు వస్తామని చెప్పిన బీజేపీ దేశ ప్రజలను మోసం చేసిందని కాంగ్రెస్ నాయకుడు రిజ్వాన్ ఆరోపించారు.

ఉద్యోగం లేదు..... రూ. 15 లక్షలు లేవు
బీజేపీ అధికారంలోకి వచ్చిన తరువాత బ్లాక్ మని తీసుకు వచ్చి ప్రజలకు పంచిపెడుతామని, అందరికి ఉద్యోగాలు ఇస్తామని చెప్పారు. ఇప్పుడు మోడి మాత్రం ప్రధాని ఉద్యోగం చేస్తున్నారని ఎద్దేవ చేశారు.

అశోక్ హోటల్ ఎందుకు అమ్మేశారు
గతంలో అధికారంలో ఉన్న ఎన్ డీఏ ప్రభుత్వం ప్రభుత్వానికి చెందిన స్టార్ హోటల్ లలిత్ అశోక్ ను తక్కువ ధరకు అమ్మేశారు. ఇప్పుడు బీజేపీ నాయకులు అదే హోటల్ లో కుర్చుని రాజకీయాలు చేస్తున్నారని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు సూరజ్ హెగ్డే ఆరోపించారు.

చర్చ జరగలేదు
కర్ణాటక రాష్ర్ట మంత్రి దినేష్ గుండూరావ్ మాట్లాడుతూ భూ సేకరణ చట్టం సవరించి పార్లమెంట్ సమావేశాలలో చర్చించకుండ ఏక పక్షంగా బీజేపీ నాయకులు నిర్ణయం తీసుకున్నారని ఆరోపించారు.

కార్పొరేటర్ సంస్థలకు లాభం
భూ సేకరణ చట్టం వలన కార్పొరేట్ కంపెనీలకు లాభం, అలాంటి సంస్థలకు కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం అండగా నిలిస్తున్నదని ఆరోపించారు. మోడి భారత ప్రధాని, మమ్మల్ని మోడితో కలవడానికి అవకాశం ఇవ్వాలని డిమాండ్ చేశారు.
మోడి సంతకాల చెక్ లు
మోడి అధికారంలోకి వచ్చి ఇన్ని రోజులు అయినా మా బ్యాంకు అకౌంట్ లలో నగదు డిపాజిట్ కాలేదు, ఇచ్చిన మాట మోడి మరిచిపోయి ఉంటారని వ్యంగంగా అన్నారు.












Click it and Unblock the Notifications