విషాదం: మరికొద్దిగంటల్లోనే పెళ్ళి, స్నేహితులతో పార్టీలో పాల్గొన్న వరుడు మృతి

Posted By:
Subscribe to Oneindia Telugu

భువనేశ్వర్: కొన్ని గంటల్లో వివాహం. వరుడి స్నేహితులు పెళ్ళి చేసుకొంటున్నందుకు విందు ఇవ్వాలని వరుడిని కోరారు.అంతేకాదు తమతో పాటు మద్యం తాగాలని ఒత్తిడి తెచ్చారు. అయితే ఆ మద్యమే కొంపముంచింది. పెళ్ళిపీటలపై ఎక్కాల్సిన వరుడు స్మశానికి వెళ్లాడు. కల్తీ మద్యం తాగి వరుడు మరణించాడు.దీంతో ఈ కుటుంబంలో విషాదం నెలకొంది.ఈ ఘటన ఒడిశాలో చోటుచేసుకొంది.

ఒడిశా రాష్ట్రంలోని భద్రక్ జిల్లాలో ఈ విషాద ఘటన చోటుచేసుకొంది. కార్తీక్ నాయక్ వివాహం అంగరంగ వైభవంగా ఏర్పాట్లు జరిగాయి. మరికొన్ని గంటల్లోనే వివాహం జరగాల్సి ఉంది. అయితే వివాహం సందర్భంగా పార్టీ ఇవ్వాలని కార్తీక్ ను స్నేహితులు డిమాండ్ చేశారు.

Youth Cremated A Day Before Marriage In Groom’s Attire

ఆదివారం నాడు వివాహం. అయితే శనివారంనాడు మిత్రులు అతడిని మందు పార్టీ ఇవ్వాలని కోరారు.అయితే మందు పార్టీ ఇచ్చాడు కార్తీక్. అయితే స్నేహితులు అతడిని కూడ తాగాలని బలవంతపెట్టారు.

స్నేహితులతో కలిసి ఆయన మద్యం సేవించారు. అయితే వారు తాగింది కల్తీ మద్యం.దీంతో వారంతా అస్వస్థతకు గురయ్యారు. కార్తీక్ ను కుటుంబసభ్యులు ఆసుపత్రికి తరలించారు.అయితే ఆసుపత్రికి చేరేలోపుగానే ఆయన మరణించాడు. పెళ్ళిదుస్తుల్లోనే వరుడు కార్తీక్ ను స్మశానికి తీసుకెళ్ళారు. ఈ ఘటనతో ఆ రెండు కుటుంబాల్లో విషాదం నెలకొంది.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
A youth named Kartik Nayak died a day before his marriage after consuming spurious liquor. His family members cremated him donned in groom’s attire sherwani, turban, et al like a groom before taking him to the cremation ground for the last rites.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి