రాబోతుంది యూట్యూబ్ లెర్నింగ్.. ఆ కార్పోరేట్ సంస్థలకు కంటిమీద కునుకు కష్టమే!!

గూగుల్ కు చెందిన యూట్యూబ్ కార్పొరేట్ దిగ్గజాలకు బడా షాక్ ఇవ్వబోతుందా? విద్యా సంబంధిత వ్యాపారంలోకి యూట్యూబ్ అడుగుపెడుతుందా? ఆ కోర్సుల ద్వారా యూట్యూబ్ డిజిటల్ లెర్నింగ్ విభాగంలో సంచలనం సృష్టించబోతుందా? అంటే అవుననే సమాధానమే వస్తోంది.

కార్పోరేట్ దిగ్గజాలకు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్న యూట్యూబ్

కార్పోరేట్ దిగ్గజాలకు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్న యూట్యూబ్

గూగుల్ కు చెందిన యూట్యూబ్ ఇప్పుడు విద్యాసంబంధిత వ్యాపారంలోకి అడుగు పెట్టబోతున్నదన్న వార్త డిజిటల్ కార్పొరేట్ ఎడ్యుకేషన్ అందిస్తున్న దిగ్గజాలకు షాక్ ఇస్తుంది. యూట్యూబ్ లెర్నింగ్ పేరుతో కోర్సులను ప్రారంభిస్తున్నట్టు యూట్యూబ్ ఎండి ఇషాన్ జాన్ చటర్జీ అనధికారికంగా చేసిన ప్రకటన ఇప్పుడు కార్పొరేట్ దిగ్గజాలకు కంటి మీద కునుకు లేకుండా చేస్తుంది. బైజుస్, ఆకాశ్, అన్ అకాడమీ తదితర సంస్థలకు యూట్యూబు గట్టిపోటీ ఇవ్వనుంది. యూట్యూబ్ ప్రతి ఆండ్రాయిడ్ ఫోన్లో ఉంటుంది కాబట్టి, మిగిలిన సంస్థలతో పోలిస్తే యూట్యూబ్ ఎక్కువ మందిని చేరుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి యూట్యూబ్ లెర్నింగ్ మిగతా సంస్థలకు చెక్ పెట్టే అవకాశం లేకపోలేదు.

సబ్ స్క్రిప్షన్ విధానంలో కోర్సులను ఆఫర్ చెయ్యనున్న యూట్యూబ్

సబ్ స్క్రిప్షన్ విధానంలో కోర్సులను ఆఫర్ చెయ్యనున్న యూట్యూబ్

యూట్యూబ్ తమ కోర్సులను సబ్స్క్రిప్షన్ విధానంలో ఆఫర్ చేయనుంది. సబ్స్క్రిప్షన్ కు చందా చెల్లించడం ద్వారా యూట్యూబ్ కోర్సులు నేర్చుకునే అవకాశం ఉంటుంది. వివిధ కోర్సులకు సంబంధించిన కంటెంట్ ను అందించే క్రమంలో యూట్యూబ్ వివిధ భాగస్వాములు, కంటెంట్ క్రియేటర్ లతో ఒప్పందం చేసుకొని తన సేవలను ప్రారంభించింది. ఇక ఈ సేవలు 2023 మొదటి ఆరు నెలల్లోనే అందుబాటులోకి రానున్నట్లు తెలుస్తోంది.

డిజిటల్ లెర్నింగ్ విభాగంలో భారత్ పెద్ద మార్కెట్ .. అందుకే మొదటగా భారత్ లో

డిజిటల్ లెర్నింగ్ విభాగంలో భారత్ పెద్ద మార్కెట్ .. అందుకే మొదటగా భారత్ లో

ముందుగా భారతదేశం, దక్షిణ కొరియా, అమెరికా వంటి దేశాలలో యూట్యూబ్ కోర్సులను ప్రారంభిస్తామని యూట్యూబ్ ఎండి అనధికారికంగా ప్రకటన చేశారు. డిజిటల్ లెర్నింగ్ విభాగంలో భారత్ పెద్ద మార్కెట్ గా ఉందని, అందుకే ముందుగా భారత యూట్యూబ్ లెర్నింగ్ ద్వారా డిజిటల్ లెర్నింగ్ తీసుకురానున్నట్టు తెలిపారు. విద్యార్థులు అనేక నైపుణ్యాలను, నాణ్యమైన కంటెంట్ ద్వారా యూట్యూబ్ లో సులభంగా నేర్చుకునే విధానం ఉంటుందని, కోర్సులు అదేవిధంగా తీర్చిదిద్దుతామని చెప్పారు. ఇక డిజిటల్ వేదికగా తమ కంటెంట్ ను విక్రయించాలి అని భావించే కంటెంట్ క్రియేటర్లకు తాము వేదిక కల్పిస్తామని ఇషాన్ జాన్ చటర్జీ తెలిపారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+