నిలువెత్తు బంగారంతో రీల్స్.. 118 సవర్ల బంగారం స్వాహా

సోషల్ మీడియాలో పాపులారిటీ కోసం చేసే కొన్ని పనులు కొన్నిసార్లు ఊహించని భారీ మూల్యాన్ని చెల్లించేలా చేస్తాయి. తమ ఇంట్లో ఎంత బంగారం, డబ్బు ఉందో వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన ఓ ప్రముఖ యూట్యూబర్ కుటుంబానికి గట్టి షాక్ తగిలింది. వీడియోలో తమ ఆస్తులను బహిరంగంగా ప్రదర్శించడమే ఆమె కొంపముంచిందని. ఇంత భారీ మొత్తంలో బంగారాన్ని, డబ్బును చూస్తే దొంగలు ఎందుకు సైలెంట్ గా ఉంటారు. వాళ్ల టాలెంట్ తో ఉన్నదంతా ఊడ్చేశారు. కేరళ సరిహద్దు ప్రాంతమైన కన్యాకుమారి జిల్లా నామర్కోవిల్ సమీపంలో జరిగిన ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది.

నామర్కోవిల్ సమీపంలోని తంబాట్టుకోణం ప్రాంతంలో నివసించే వినోద్ కుమార్, మధుమిత దంపతులు ప్రముఖ యూట్యూబర్లుగా గుర్తింపు పొందారు. వీరు ఇటీవల తమ ఇంట్లోని పూజా గదిలో ఉన్న భారీ బంగారు ఆభరణాలు, వజ్రాలు, నగదును స్పష్టంగా చూపిస్తూ ఓ వీడియోను సోషల్ మీడియాలో అప్లోడ్ చేశారు. ఈ వీడియో ఆన్‌లైన్‌లో విపరీతంగా వైరల్ అయింది. అయితే, ఇదే వీడియో దొంగలకు దొచుకునేందుకు సృష్టించేందుకు దారి చూపింది. ఈ వీడియోను చూసిన దుండగులు పక్కా ప్లాన్‌తో రంగంలోకి దిగారు.

YouTuber House Burgled Of 118 Sovereigns Gold Jewelry After Showing Wealth On Social Media Video Post
Viral Video: రీల్స్ పిచ్చితో 30 అడుగుల ఎత్తునుంచి డ్యామ్‌ లోకి.. తర్వాత ఏం జరిగిందంటే..?
Viral Video: రీల్స్ పిచ్చితో 30 అడుగుల ఎత్తునుంచి డ్యామ్‌ లోకి.. తర్వాత ఏం జరిగిందంటే..?

సీసీటీవీల నిఘా ఉన్నా ఆగని దొంగల దురాఘాతం..

సోషల్ మీడియాలో ఈ వీడియో ప్రత్యక్షమైన తర్వాతి రోజే దొంగలు తమ ప్రణాళికను అమలు చేశారు. దంపతులు ఇంట్లో లేని సమయం చూసి, అత్యంత భద్రత కలిగిన ఆ ప్రాంతంలోకి ప్రవేశించారు. ఇంటి వెనుక వైపు ఉన్న తలుపులను పగులగొట్టి లోపలికి చొరబడ్డారు. పూజా గదిలో భద్రపరిచిన ఏకంగా 118 సవర్ల బంగారు, వజ్రాభరణాలతో పాటు రూ. 50 వేల నగదును దోచుకెళ్లారు. ఇంట్లో ఉన్న విలువైన వస్తువులన్నీ మాయం కావడంతో బాధితులు లబోదిబోమంటూ పోలీసులను ఆశ్రయించారు.

తెలంగాణలో విచిత్ర దొంగతనం.. 10 కేజీలు చికెన్ చోరీ !!
తెలంగాణలో విచిత్ర దొంగతనం.. 10 కేజీలు చికెన్ చోరీ !!

రంగంలోకి దిగిన పోలీసులు..

ఈ భారీ చోరీ ఘటనపై సమాచారం అందుకున్న రాజకమంగలం పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తును తీవ్రతరం చేశారు. ఆ ప్రాంతంలోని సీసీటీవీ పుటేజీలను పరిశీలించడంతో పాటు, ఆన్‌లైన్ వీడియోను ఎవరు చూశారు, ఎవరి ప్రమేయం ఉందనే కోణంలో ఫోన్ కాల్ డేటాను కూడా పోలీసులు సేకరిస్తున్నారు. సోషల్ మీడియాలో తమ వ్యక్తిగత విషయాలను, సంపదను అతిగా ప్రదర్శించడం ఎంత ప్రమాదకరమో ఈ ఘటనే మరోసారి నిరూపించిందని హెచ్చరిస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+