మోడీకి మళ్లీ జగన్ ఝలక్..! ఛీఫ్ జస్టిస్ ఉండాల్సిందే..!
కేంద్ర ఎన్నికల సంఘంలో కమిషనర్ల నియామక చట్టంలో కేంద్రంలో 2023లో మార్పులు చేసింది. ఎన్నికల కమిషనర్ల నియామకాలు చేసే కమిటీలో ఉండే ముగ్గురు సభ్యుల్లో ప్రధాని, విపక్ష నేతతో పాటు సుప్రీంకోర్టు ఛీఫ్ జస్టిస్ కూడా ఉండేవారు. అయితే దీన్ని మార్చి ప్రధాని, విపక్ష నేతతో పాటు ప్రధాని సిఫార్సు చేసే కేంద్రమంత్రి మాత్రమే ఉండేలా పార్లమెంట్ లో చట్ట సవరణ చేశారు. దీన్ని సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో పిటిషన్లు దాఖలైనా వీటిపై విచారణ మాత్రం మూడేళ్లుగా ముందుకు సాగలేదు.
అయితే తాజాగా సుప్రీంకోర్టు దీనిపై విచారణ చేపట్టినా, ద్విసభ్య ధర్మాసనంలో ఉన్న ఇద్దరు సభ్యులు దీని రాజ్యాంగ బద్దతను తేల్చే విషయంలో వేర్వేరు తీర్పులిచ్చారు. దీంతో ఈ వివాదం ఇప్పుడు ఛీఫ్ జస్టిస్ కోర్టుకు చేరింది. ఆయన త్వరలో దీనిపై నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. అయితే ఆ లోపే కేంద్ర ఎన్నికల సంఘంలో వివాదాలు చెలరేగడం, ఎస్ఐఆర్ ప్రక్రియపై కీలక నిర్ణయాన్ని ఎన్నికల కమిషనర్లకు తెలియకుండా సీఈసీ జ్ఞానేష్ కుమార్ తీసేసుకున్న వ్యవహారం వివాదాస్పదమైంది. దీనిపై ఇప్పుడు ఢిల్లీలో, ముంబైలో, అలాగే దేశంలోని ఇతర రాష్ట్రాల్లోనూ ఆందోళనలు కొనసాగుతున్నాయి.

Bring an amendment to the Bill for a 3-member committee of the PM, LoP and CJI to appoint the Election Commissioner and restore public confidence.@ECISVEEP https://t.co/Of0LkMRFz2
— YSR Congress Party (@YSRCParty) October 7, 2026
ఈ నేపథ్యంలో గత ఎన్నికల్లో ఈసీ తప్పిదాల వల్ల తాము అధికారం కోల్పోయినట్లు భావిస్తున్న వైఎస్సార్సీపీ (YSRCP) కూడా గళం విప్పింది. గతంలో ఎన్నికల కమిషనర్ల నియామకాల చట్టంలో మార్పులకు పార్లమెంట్ లో మద్దతిచ్చిన వైఎస్సార్సీపీ ఇప్పుడు యూటర్న్ తీసుకుని ఆ చట్టంలో తిరిగి మార్పులు చేయాలని డిమాండ్ చేస్తోంది. తాజాగా ఇదే డిమాండ్ ను నేరుగా వైఎస్ జగన్ తెరపైకి తీసుకువచ్చారు. ఎన్నికల కమిషనర్ల నియామకాల కమిటీలో ప్రధాని, విపక్ష నేతతో పాటు ప్రధాని సూచించిన కేంద్రమంత్రి కాకుండా గతంలోలా ఛీఫ్ జస్టిస్ ఉండాలని జగన్ కోరుతున్నారు. ఇవాళ మరోసారి వైఎస్సార్సీపీ ఎక్స్ హ్యాండిల్ ద్వారా ఇదే డిమాండ్ ను కేంద్రానికి వినిపించేందుకు ప్రయత్నించారు. ఎన్నికల కమిషనర్ల నియామకాలపై వివాదాలు కొనసాగుతున్న వేళ జగన్ లేవనెత్తిన ఈ డిమాండ్ పై జాతీయ పార్టీలు ఇప్పటివరకూ స్పందించలేదు. దీంతో సోషల్ మీడియాలో ఇంగ్లీష్ లో ఇదే డిమాండ్ పెట్టడం ద్వారా జాతీయ పార్టీలతో పాటు మీడియా దృష్టికి దీన్ని తీసుకెళ్లేందుకు వైసీపీ ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది.














Click it and Unblock the Notifications
