రైతు నిరసనలపై వివాదాస్పద వీడియోలు- తొలగించాలని జీ న్యూస్ కు NBDSA ఆదేశం

కేంద్ర ప్రభుత్వ వ్యవసాయ చట్టాలకు నిరసనగా రైతుల సాగించిన ఉద్యమంపై వివాదాస్పద వీడియోలు ప్రసారం చేసిన జీ న్యూస్ శాటిలైట్ ఛానల్ కు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఈ వీడియోలు తమ నైతిక ప్రమాణాల్ని, వార్తా ప్రసార ప్రమాణాలను ఉల్లంఘించేలా ఉన్నాయని తేలడంతో న్యూస్ బ్రాడ్ కాస్టింగ్ డిజిటల్ స్టాండర్డ్స్ అధారిటీ వాటిని తొలగించాలని జీ న్యూస్ కు ఆదేశాలు ఇచ్చింది.

రైతుల ఉద్యమాన్ని ఖలిస్తాన్ ఉద్యమంతో లింక్ చేసేలా ఉన్న ఈ వీడియోలపై ఫిర్యాదులు వెల్లువెత్తాయి. సామాజిక కార్యకర్త ఇంద్రజీత్ ఘోర్పడే చేసిన ఫిర్యాదుపై స్పందించిన న్యూస్ బ్రాడ్ కాస్టింగ్ డిజిటల్ స్టాండర్డ్స్ అధారిటీ ఈ ఆదేశాలు జారీ చేసింది. న్యూస్ బ్రాడ్ కాస్టింగ్ డిజిటల్ స్టాండర్డ్స్ అధారిటీ భారతీయ శాటిలైట్ ఛానళ్ల ప్రసారాలను సమీక్షించేందుకు ఏర్పాటైన ఓ స్వచ్ఛంద సంస్ధ. శాటిలైట్ టీవీ ఛానళ్ల ప్రసారాలపై దీనికి అందిన ఫిర్యాదులపై విచారణ జరిపి తగు నిర్ణయాలు తీసుకుంటుంది అవసరమైతే అభ్యంతర కంటెంట్ ను తొలగించాలని ఆయా ఛానళ్లకు ఆదేశాలు కూడా ఇస్తుంది.

zee news asked to delete 3 controversial videos linking farmers protest to khalistan movement

జీ న్యూస్ ప్రసారం చేసిన మూడు వీడియోలపై ఫిర్యాదులొచ్చాయి. వీటిలో జనవరి 25న సామాజిక కార్యకర్త ఘోర్పడే ఫిర్యాదులో ఒకటి, 'తాల్ థోక్ కే: ఖలిస్తాన్ సే కబ్ సావధాన్ హోగా కిసాన్?' పేరుతో రైతుల నిరసనకు సంబంధించిన రెండు కార్యక్రమాల గురంచి ఉన్నాయి. అలాగే 'తాల్ థోక్ కే: నహీ మానే కిసాన్ తో క్యా రిపబ్లిక్ డే పర్ హోగా 'గృహ యుద్ధం'?' వరుసగా జనవరి 19 మరియు 20 తేదీలలో జీ న్యూస్‌లో ప్రసారం చేయబడింది.

ఫిర్యాదుదారు ఈ ప్రోగ్రామ్‌లు NBDSA యొక్క కోడ్‌ను ఉల్లంఘించాయని, ఇతర విషయాలతోపాటు, రిపోర్టింగ్ "ప్రేక్షకులలో భయాందోళనలు, బాధలు లేదా అనవసరమైన భయాన్ని కలిగించకూడదు" మరియు వాస్తవిక లోపాలను వీలైనంత త్వరగా సరిదిద్దాలి మరియు దిద్దుబాటుకు ప్రాధాన్యత ఇవ్వాలని తెలిపారు. దీంతో ఈ ఫిర్యాదుల్ని పరిశిలించిన ఎన్బీడీఎస్ఏ ఈ వీడియోలు తొలగించాలని ఆదేశాలు ఇచ్చింది..

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+