వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

షాక్: నెల రోజుల్లోనే లక్ష టెక్కీ ఉద్యోగాలు పోయాయి!

|
Google Oneindia TeluguNews

వాషింగ్టన్: ప్రపంచ ఐటి ప్రపంచాన్ని ఆశ్చర్యానికి గురిచేసే వార్త ఇది. గడచిన మే నెలలోనే అమెరికాలోని ఐటీ సంస్థల్లో పనిచేస్తున్న 96వేల మందిని ఆయా యాజమాన్యాలు ఉద్యోగాల నుంచి తొలగించాయని ఇండస్ట్రీ ట్రేడ్ బాడీ కాంప్ టీఐఏ తన తాజా నివేదికలో వెల్లడించింది.

ఈ ఉద్యోగుల తొలగింపుతో అమెరికాలో ఐటీ సంస్థల్లో పనిచేస్తున్న వారి సంఖ్య 4.5 మిలియన్ డాలర్లకు తగ్గిందని వివరించింది. మేలో ఐటీ ఉద్యోగాల ట్రెండ్ నిరుత్సాహ పరిచిందని, దీని ఫలితంగానే నిరుద్యోగుల సంఖ్య 38 వేలు పెరిగిందని కాంప్ టీఐఏ(రీసెర్చ్ అండ్ మార్కెటింగ్ ఇంటెలిజెన్స్) సీనియర్ వైస్ ప్రెసిడెంట్ టిమ్ హెర్బర్ట్ వెల్లడించారు.

jobs

ఐటీ, ఐటీ ఆధారిత సంస్థలకు మే నెల కష్టకాలంగా నిలిచిందని ఆయన అభిప్రాయపడ్డారు. ఐటీ ఆధారిత సంస్థలతో పోలిస్తే ఐటీ కంపెనీల్లో ప్రత్యక్ష ఉపాధిని పొందుతున్న వారు అధిక సంఖ్యలో ఉద్యోగాలను కోల్పోయారని ఆయన వివరించారు.

మొత్తం 15,500 మంది కంప్యూటర్ సిస్టమ్స్ ఇంజనీర్స్, అర్కిటెక్ట్స్, 13,900 మంది కంప్యూటర్ సిస్టమ్ అనలిస్టులు, 13,700 మంది ఐటీ ప్రాజెక్టు మేనేజర్లు, 13,200 మంది యూజర్ సపోర్ట్ స్పెషలిస్టులు ఉద్యోగాలు కోల్పోయారని, ఇదే సమయంలో ఐటీ సేవల విభాగంలో 7,400 మంది విధుల్లో చేరారని హెర్బర్ట్ తెలిపారు.

మే 2015 నుంచి మే 2016 వరకు ఐటి సేవల విభాగంలో కేవలం 86,700 ఉద్యోగాలు మాత్రమే పెరిగాయని తెలిపారు. ప్రస్తుత ఉద్యోగుల తొలగింపును బట్టి చూస్తే వారు తమ నైపుణ్యాలను పెంచుకోవాల్సిన అవసరం ఉందని చెప్పారు.

English summary
Employers in US eliminated 96,000 IT or information-technology jobs in May, according to an analysis by industry trade body CompTIA.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X