వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

Coronavirus: వావ్..సూపర్, కరోనాను జయించిన శతాధిక వృద్ధుడు, గతవారం వైరస్ సోకడంతో...

|
Google Oneindia TeluguNews

నోవల్ కరోనా వైరస్ రక్కసి.. ఇటలీని అతలాకుతలం చేసింది. వైరస్ ఆవిర్భవించిన చైనా కన్నా మరణాలు ఎక్కువగా నమోదయ్యాయి. వైరస్ ఎలా ఆవిర్భవించిందో ఇప్పటికీ స్పష్టత లేకపోవడంతో నివారణ మందు కనిపెట్టలేదు. వ్యక్తిగత పరిశుభ్రత, స్వీయ నియంత్రణ ముఖ్యమని నెత్తి నోరు బాదుకుంటున్నారు. చిన్న పిల్లలు, వృద్దులు వైరస్ బారినపడితే అంతే అని వైద్యులు హెచ్చరిస్తున్నారు. కానీ ఇటలీలో అద్భుతం జరిగింది.

శతాధిక వృద్దుడు

శతాధిక వృద్దుడు

రిమినీలో అనే 101 ఏళ్ల వృద్దుడు మిస్టర్ పి కీ గత వారం కరోనా పాజిటివ్ సోకింది. దీంతో అతనిని ఆస్పత్రిలో చేర్చి చికిత్స అందించారు. వాస్తవానికి వైరస్ సోకిన వృద్దులు కోలుకోవడం కష్టమని, ఇదివరకు చనిపోయిన వారు కూడా వృద్దులను వైద్యులు తెలిపారు. కానీ మిస్టర్ పి మాత్రం చికిత్సకు బాగా స్పందించారు. దీంతో అతనికి వైరస్ తగ్గడంతో వైద్యుల సిఫారసు మేరకు డిశ్చార్జ్ చేసి ఇంటికి తీసుకొచ్చారు.

1919లో జననం..

1919లో జననం..

మిస్టర్ పీ 1919లో జన్మించారని రిమిని వైస్ మేయర్ గ్లోరియా లిసి పేర్కొన్నారు. కరోనా వైరస్ సోకిన మిస్టర్ పి మాత్రం వేగంగా కోలుకున్నారని వివరించారు. వందేళ్ల కన్నా ఎక్కువ ఉన్న పి కోలుకోవడం శుభపరిణామం అని ఆయన వివరించారు. దీంతో వైరస్ చిన్న, పెద్ద అనే తేడా లేదని, సరైన ట్రీట్‌మెంట్ తీసుకుంటే కోలుకోవచ్చని తెలిపారు.

ప్రజల్లో ధైర్యం..

ప్రజల్లో ధైర్యం..

గత కొన్ని వారాలుగా ఇటలీపై కరోనా కరాళ నృత్యం చేస్తోంది. దీంతో నగరం శవాల దిబ్బగా మారింది. ఈ క్రమంలో శతాధిక వృద్దుడు మిస్టర్ పీ కరోనా వైరస్ నుంచి కోలుకోవడం ఆ దేశ ప్రజల్లో ధైర్యం నింపిందని వైస్ మేయర్ లిసి పేర్కొన్నారు. వైరస్‌పై ప్రపంచం పోరాడుతున్న వేళ.. మిస్టర్ పీ కి నయమవడం ప్రజల్లో కూడా ధైర్యం నింపింది.

English summary
101-year-old man in Rimini, Italy has recovered from the novel coronavirus. The man is referred to as Mr. P and has now been taken home by his family, according to reports
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X