బైక్‌ను అడ్డం పెట్టుకుని ఐదు రోజులు శిథిలాల కింద సజీవంగా...
ఖాట్మండు: అతను మృత్యువుతో పోరాడాడు. ఐదు రోజుల తరువాత తనను రక్షించండంటూ ఐదు రోజుల తర్వాత అతను సహాయక చర్యలు చేపడుతున్న వారిని కేకలు వేసి ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని బయటకు వచ్చాడు. నేపాల్ లో గురువారం 18 సంవత్సరాల యువకుడు శిథిలాల నుండి బయటకు రావడంతో అతనిని వెంటనే ఆసుపత్రికి తరలించారు.
శనివారం భూకంపం వచ్చిన సమయంలో పెంబా తమాంగ్ (15) అనే బాలుడు ఖాట్మండులోని 9 అంతస్తుల భవనం కింద ఉన్నాడు. ఆ సందర్బంలో 9 అంతస్తులు కూలిపోయిన సమయంలో అతను ఒక బైక్ ను అడ్డు పెట్టుకొవడంతో శిథిలాల కింద చిక్కుకున్నాడు.

ఐదు రోజుల పాటు తనను ఎవరైనా బయటకు తీయ్యకపోతారా అని ఎదురు చూశాడు. తిండి తిప్పలు లేక ఐదు రోజుల పాటు చిమ్మ చీకటిలో మృత్యువుతో పోరాడాడు. గురువారం సహాయక చర్యలు చేపడుతున్న వారు శిథిలాలు తీస్తున్న సమయంలో అతను గట్టిగా కేకలు వేశాడు.
వెంటనే సహాయక చర్యలు చేపడుతున్న వారు అతనికి క్షేమంగా బయటకు తీసి తాగడానికి మంచి నీళ్లు ఇచ్చి ఆసుపత్రికి తరలించారు. శిథిలాల కింద చనిపోయినవారే కాదని, బ్రతికి ఉన్న వారు ఉండవచ్చని సహాయక చర్యలు చేపడుతున్న వారు అంటున్నారు.












Click it and Unblock the Notifications