హాట్‌ ఎయిర్ బెలూన్‌లో మంటలు: 16మంది సజీవదహనం

Subscribe to Oneindia Telugu

టెక్సాస్‌: అమెరికాలోని టెక్సాస్‌లో శనివారం జరిగిన హాట్‌ ఎయిర్ బెలూన్ ప్రమాదంలో 16 మంది పర్యాటకులు మృతి చెందారు. టెక్సాస్‌లోని లఖార్ట్‌ సమీపంలో హాట్ ఎయిర్ బెలూన్‌లో అకస్మాత్తుగా మంటలు వ్యాపించడంతో ఈ ఘటన చోటుచేసుకుంది.

ఈ ప్రమాదంలో పర్యాటకులంతా మృతి చెందినట్టు స్థానిక మీడియా వెల్లడించింది. స్థానిక కాలమానం ప్రకారం.. ఉదయం 7.40 ప్రాంతంలో బెలూన్‌లో మంటలు చెలరేగడతో బెలూన్‌ నేలపై కుప్పకూలినట్టు ఫెడరల్‌ ఏవియేషన్‌ అడ్మినిస్ట్రేషన్‌( ఎఫ్‌ఏఏ) పేర్కొంది.

ఈ ఘటనకు గల కారణాలపై ఎఫ్‌ఏఏ అధికారులు విచారణ చేపట్టారు. చివరకు జాతీయ రవాణా భద్రత సంస్థ కూడా ఈ ఘటనపై విచారించేందుకు రంగంలోకి దిగింది.

బెలూన్‌ ప్రమాదంలో మృతిచెందినవారి పట్ల టెక్సాస్‌ గవర్నర్ గ్రెగ్ అబోట్ సంతాపాన్ని ప్రకటించారు. మృతుల కుటుంబ సభ్యులకు ఆయన సానుభూతిని తెలియజేస్తున్నట్టు ఒక ప్రకటనలో తెలిపారు.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
At least 16 people were killed on Saturday morning after a hot air balloon caught fire and crashed near Lockhart, a city in the central part of the US state of Texas.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి