190 పురాతన ఆలయాలు నేలమట్టం
అత్యంత పురాతనమైన పగోడాలు చాల వరకు కుప్పకూలిపోయాయని మయన్మార్ అధికార వర్గాలు తెలిపాయి. మాగ్వే, యోనాన్ చౌంగ్ ప్రాంతాల్లో భూమి ఎక్కువగా కంపించిందని అధికారులు చెప్పారు.
భూకంప ప్రభావం పొరుగునున్న భారతదేశం, బంగ్లాదేశ్ మీద కనిపించింది. భూకంప కేంద్రం మయన్మార్ దక్షిణంగా 190 కిలోమీటర్ల దూరంలోని మండలే నగరం దగ్గర ఉందని భారత వాతావరణ శాఖ అధికారులు గుర్తించారు.

భూకంప కేంద్రం భూమికి 90 కిలోమీటర్ల లోతులో ఉందని అధికారులు గుర్తించారు. గత రెండు రోజుల్లో మయన్మార్ లో రెండు సార్లు భూకంపం వచ్చింది. దీని ప్రభావం భారత్- మయన్మార్ సరిహద్దులతో పాటు మేఘాలయ, మిజొరం, త్రిపుర, అసోంల మీద పడింది.
భూకంపం తాకిడికి మయన్మార్ దేశాన్ని కుదిపేసింది. భూకంపం తాకిడికి నలుగురు పౌరులు మరణించారు. అత్యంత పురాతనమైన 190 బౌద్ధ ఆలయాలు నేలమట్టం అయ్యాయి. . భూకంప కేంద్రం మయన్మార్ దక్షిణంగా 190 కిలోమీటర్ల దూరంలోని మండలే నగరం దగ్గర ఉందని భారత వాతావరణ శాఖ అధికారులు గుర్తించారు.












Click it and Unblock the Notifications