బ్యాంకాక్ పేలుడు: ఇద్దరి భారతీయుల అరెస్ట్
బ్యాంకాక్/న్యూఢిల్లీ: థాయ్‌లాండ్‌లోని బ్రహ్మ దేవాయం సమీపంలో జరిగిన బాంబుపేలుడు కేసులో ఇద్దరు భారతీయులు అరెస్టు అయ్యారు. ఈ విషయంపై స్పందించిన భారత విదేశీ వ్యవహారాల శాఖ సమగ్ర వివరాలు తెలుసుకోవాలని థాయ్‌లోని భారత రాయబార కార్యాలయానికి సూచనలు చేసింది.
ఆగస్టు 17న జరిగిన బాంబు పేలుడులో 20 మంది మృతిచెందగా.. 100మందికిపైగా గాయపడ్డారు.

మైమునా గార్డెన్ హోమ్ అపార్ట్‌మెంట్‌లో ఆదివారం రాత్రి 9 గంటలకు ఇద్దరు భారతీయులను అసిస్టెంట్ పోలీస్ కమిషనర్ జనరల్ ప్రవుత్ థవోర్న్‌సిరి నేతృత్వంలోని పోలీసు బృందం అదుపులోకి తీసుకుంది.
పోలీసులు వారిని ప్రశ్నించిన అనంతరం వదిలివేశారు. కాగా, భారతీయుల అరెస్టుపై నివేదిక ఇవ్వాల్సిందిగా రాయబార కార్యాలయానికి సూచించినట్లు భారత విదేశాంగశాఖ వర్గాలు పేర్కొన్నాయి.












Click it and Unblock the Notifications