ఘోర ప్రమాదాలు: నైజీరియాలో 20మంది, కెన్యాలో 30మంది మృతి
లాగోస్: నూతన సంవత్సరం రోజున నైజీరియా, కెన్యా దేశాల్లో విషాద ఘటనలు చోటుచేసుకున్నాయి. నైజీరియాలో రెండు చోట్ల జరిగిన ఘోర రోడ్డు ప్రమాదాల్లో దాదాపు 20మంది ప్రాణాలు కోల్పోయారు. నైజీరియాలోని జింగ్వా, ఒగున్ రాష్ట్రాలో ఈ దుర్ఘటనలు జరిగాయని పోలీసు అధికారులు వెల్లడించారు.
జింగ్వా రాష్ట్రంలో బస్సు-ట్రక్కు ఢీకొనడంతో 15 మంది మరణించారు. వీరిలో ఇద్దరు చిన్నారులు కూడా ఉన్నారు. అయితే ఏడుగురు ఎక్కాల్సిన వాహనంలో 14 మంది ప్రయాణికులు ఎక్కడంతో ఈ ఘోరం జరిగిందని అధికారులు వివరించారు.

ఒగున్ రాష్ట్రంలో జరిగిన మరో ప్రమాదంలో ఐదుగురు మరణించగా, 13 మందికి తీవ్రగాయాలయ్యాయి. నిర్లక్ష్యంగా వాహనాలు నడపడం, వాహనం సామర్థ్యానికి మించి ప్రయాణికులను ఎక్కించడం వల్లే రోడ్డు ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నాయని ఫెడరల్ రోడ్ సేఫ్టీ కమాండ్ అధికారి తెలిపారు.
ఇది ఇలా ఉండగా, కెన్యాలో ఆదివారం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో 30మంది మరణించారు. మరో 16మంది వరకు తీవ్రగాయాలపాలయ్యారు. అత్యంత వేగంగా వెళుతున్న ట్రక్కు, బస్సు ఢీకొనడంతో ఈ ప్రమాదం చోటు చేసుకుంది.
-
3000 ఏళ్ల సంప్రదాయం.. యుద్ధం మధ్యే నూతన సంవత్సరం -
విడాకులపై మెగా డాటర్ "నిహారిక" కామెంట్స్.. అసలు కాంటాక్ట్ కూడా లేదు ?? -
40 ఏళ్లలో లేని అతిపెద్ద పసిడి పతనం. 1983 సీన్ రిపీట్! -
ఏప్రిల్ నెలలో సింహరాశి, కన్యారాశి జాతక ఫలం -
'దురంధర్ 2' ఓ చెత్త సినిమా: స్టార్ హీరోయిన్ -
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
కొత్త పెన్షన్లు, మహిళలకు కొత్త వరాలు - రైతు భరోసా ఇక నుంచి..!! -
మనసు మార్చుకున్న బాలినేని, నెక్స్ట్ ఇక...!? -
పడింది దెబ్బ: మోత మోగిన పెట్రోల్ ధరలు- లీటర్ కు ఎంత పెరిగిందంటే? -
Gold రూ.లక్షకే సవరి.. వచ్చే 10 రోజుల్లో ఏం జరగబోతుంది -
"తృణమూల్" ఎన్నికల మ్యానిఫెస్టో రిలీజ్.. మమతా బెనర్జీ 10 హామీలు ఇవే..! -
AP Govt: రేపటి టెన్త్, ఇంటర్ పరీక్షలు వాయిదా..! కొత్త తేదీలివే..!












Click it and Unblock the Notifications