స్కూల్‌పై దాడి.. 21 మంది మృతి, 25 మందికి గాయాలు
ఉక్రెయిన్‌పై రష్యా యుద్ద కాండ కొనసాగుతోంది. పబ్లిక్ ప్లేసులు, స్కూళ్లపై కూడా దాడులకు తెగబడుతుంది. ఉక్రెయిన్‌పై దాడులు ఆపాలని అంతర్జాతీయ న్యాయస్థానం ఆదేశించినా.. రష్యా లెక్కచేయడం లేదు. గురువారం ఉక్రెయిన్‌పై దాడులను మరింత తీవ్రతరం చేసింది. ఖార్కివ్ వెలుపల ఉన్న నగరమైన మెరెఫాలో ఒక స్కూల్, సాంస్కృతిక కేంద్రంపై రష్యా సైనిక దళాలు కాల్పులు జరిపాయి.

రష్యా దళాల దాడితో 21 మంది మరణించారు. మరో 25 మంది గాయపడ్డారు. వీరిలో పది మంది పరిస్థితి సీరియస్‌గా ఉన్నట్లు తెలుస్తొంది. ఉక్రెయిన్‌లోని రెండో పెద్ద నగరమైన ఖార్కివ్‌ను పూర్తిగా స్వాధీనం చేసుకోవడానికి రష్యా దళాలు వారం రోజులుగా తెగ ప్రయత్నిస్తున్నాయి. వాయుసేన దాడులతో రష్యా విరుచుకుపడుతుంది. ఈ నగరంలో చాలా భాగం బాగా ధ్వంసమైంది.
ఉక్రెయిన్‌పై దాడులను నిలిపివేయాలనే అంతర్జాతీయ కోర్టు ఆదేశాలను రష్యా తిరస్కరించింది. ఉక్రెయిన్‌తో జరుగుతున్న చర్చల్లో పురోగతిపై వస్తున్న వార్తలను కూడా రష్యా ఖండించింది. హాలీవుడ్ నటుడు ఆర్నాల్డ్ స్క్వార్జెనెగర్ రష్యన్ సైనికులను ఉద్దేశించి ఒక వీడియోను విడుదల చేశారు. తెలివిలేని యుద్ధం కోసం రష్యా సైనికులు తమ జీవితాలను త్యాగం చేస్తున్నారని కామెంట్ చేశారు. యుద్ధాన్ని ఆపాలని రష్యా అధ్యక్షుడు పుతిన్‌ను కోరారు. రష్యా ప్రజలు అంటే తనకు ఎంతో ప్రేమని అన్నారు. అందుకే వారికి వాస్తవం తెలియజేసేందుకు ఈ వీడియో ఇస్తున్నానని ట్విట్టర్‌లో పేర్కొన్నారు.
ఉక్రెయిన్‌పై రష్యా దాడిని నిలిపివేయాలని అంతర్జాతీయ న్యాయస్థానం రష్యాను నిన్న ఆదేశించింది. రష్యా దురాక్రమణపై ఉక్రెయిన్ చేసిన ఫిర్యాదుపై నెదర్లాండ్స్ హేగ్‌లోని ప్రపంచ కోర్టు బుధవారం స్పష్టంచేసింది. ఐసీజే ఆదేశంపై ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ హర్షం వ్యక్తం చేశారు. కానీ ఏం లాభం రష్యా మత్రం వినిపించుకోవడం లేదు.












Click it and Unblock the Notifications