South Korea: దక్షిణ కొరియాలో ఘోర విమాన ప్రమాదం.. 179 మంది మృతి..!

సౌత్ కొరియాలో ఘోర విమాన ప్రమాదం జరిగింది. దక్షిణ కొరియాలోని మువాన్ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఆదివారం 181 మందితో వెళ్తున్న జెజు ఎయిర్ విమానం క్రాష్ అయింది. విమానం కూలిపోయిన తర్వాత మంటల్లో కాలుతున్న వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ల్యాండింగ్ సమయంలో విమానం రన్‌వే నుంచి పక్కకు వెళ్లింది. దీంతో మంటలు, దట్టమైన నల్లటి పొగలు అలుముకున్నాయి. విమానంలో మంటలు చెలరేగినట్లు చూపుతున్న క్రాష్ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

ల్యాండింగ్ సమయంలో విమానం ఎయిర్ పోర్ట్ గోడను ఢీకున్నట్లు అనుమానిస్తున్నారు. ఎమర్జెన్సీ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చేందుకు శ్రమిస్తున్నారు. ఈ విమానంలో 175 మంది ప్రయాణికులు, ఆరుగురు ఫ్లైట్ అటెండెంట్ ఉన్నారు. జెజు ఎయిర్ విమానం థాయ్‌లాండ్ నుంచి తిరుగు ప్రయాణంలో ల్యాండ్ అవుతుండగా ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో 179 మంది మరణించినట్ల సమాచారం.

28 killed in plane crash at Muan International Airport in South Korea

మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. విమాన ప్రమాదానికి గల కారణాలను గుర్తించేందుకు అధికారులు విచారణ చేపట్టారు. మువాన్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్‌లో రన్‌వేపై నుంచి వెళ్లి గోడను ఢీకొట్టిందని యోన్‌హాప్ వార్తా పేర్కొంది. విమానంలో చిక్కుకున్న వారిని భద్రత సిబ్బంది ఇద్దరు ప్రయాణికులను బయటకు తీసినట్లు ఓ వార్త సంస్థ పేర్కొంది. విమానం ల్యాండింగ్ సమయంలో పక్షి ఢీకొట్టి ఉండవచ్చని.. అందుకే ల్యాండిగ్ గేర్ పనిచేయకపోవడం వల్లే ప్రమాదం జరిగినట్లు అధికారులు అనుమానిస్తున్నారు.

కొద్ది రోజుల క్రితం మౌన్‌హైల్ అజర్‌బైజాన్ ఎయిర్‌లైన్స్ బాకు నుంచి రష్యాకు వెళుతున్న సమయంలో క్రాష్ అయింది. ఈ ప్రమాదంలో 38 మంది మృతి చెందగా.. 29 మంది గాయపడ్డారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+