ఫుట్‌బాల్ స్టేడియం బయట జంట పేలుళ్లు: 29 మంది మృతి
ఇస్తాంబుల్‌లో సాకర్ స్టేడియం వెలుపల బాంబులు పేలాయి. జంట పేలుళ్లు జరిగాయి. ఈ పేలుళ్లలో 29 మంది మృతి చెందారు. 166 మందికి పైగా గాయపడ్డారు.
ఇస్తాంబుల్: ఇస్తాంబుల్‌లో సాకర్ స్టేడియం వెలుపల బాంబులు పేలాయి. జంట పేలుళ్లు జరిగాయి. ఈ పేలుళ్లలో 29 మంది మృతి చెందారు. 166 మందికి పైగా గాయపడ్డారు. ఫుట్‌బాల్ మ్యాచ్ అనంతరం అందరు ఇళ్లకు చేరుకుంటున్న సమయంలో ఈ సంఘటన జరిగింది.
టర్కీ ముఖ్య నగరమైన ఇస్తాంబుల్‌లో శనివారం రాత్రి ఈ పేలుళ్లు సంభవించాయి. మృతుల్లో ఎక్కువమంది పోలీసులు ఉన్నట్లు ఆ దేశ అంతర్గత వ్యవహారాల మంత్రి సులేమాన్ తెలిపారు. పోలీసులే లక్ష్యంగా ఈ దాడులు జరిపినట్లు వెల్లడించారు.

తొలి పేలుడు ఫుట్‌బాల్ స్టేడియం బయట, రెండోది ఓ పార్క్ ఆవరణలో జరిగింది. ఈ ఘటనకు సంబంధించి ఇప్పటికే పదిమంది నిందితులను అదుపులోకి తీసుకున్నారు. తొలి దాడిలో కారు బాంబును దుండగులు వినియోగించగా, రెండో ఘటనలో ఆత్మహుతి దాడిగా పోలీసులు భావిస్తున్నారు.
తొలి పేలుడు బెసిక్తాస్ ఫుట్‌బాల్ స్టేడియం బయట చోటు చేసుకుంది. తొలి పేలుడు జరిగిన 45 సెకండ్లకు రెండో పేలుడు సంభవించింది. ఇది మక్కా పార్క్ ప్రాంతంలో చోటు చేసుకుంది. ఈ రెండు పేలుళ్లకు సంబంధం ఉండి ఉంటుందని భావిస్తున్నారు.












Click it and Unblock the Notifications