ఐసిస్‌పై పోరు: ఒక్కటైన హిందూగ్రూప్స్,ముస్లీంలు ఓకే
న్యూఢిల్లీ: ప్రపంచాన్ని వణికిస్తున్న ఇస్లామిక్ స్టేట్ (ఐసిస్) ఉగ్రవాద సంస్థను ధీటుగా ఎదుర్కొనేందుకు 40 హిందూ సంస్థలు ఒక్కటవుతున్నాయి. భారత్ దేశానికి కూడా ఐసిస్ ముప్పు పొంచి ఉంది. ఇప్పటికే పలువురు దాని వైపు మొగ్గు చూపారు. కొందరు పట్టుబడ్డారు.
ఈ నేపథ్యంలో నలభై హిందూ సంస్థలు ఐసిస్ పైన పోరాడానికి సన్నద్ధమయ్యాయి. అవన్నీ ఒకే గొడుకు కిందకు రానున్నాయి.
ఈ హిందూ సంస్థలు నిన్న (సోమవారం నాడు) ఒకే గొడుకు కిందకు వచ్చాయి. ఈ గ్రూప్‌లో హిందూ జన జాగృతి, శ్రీరామ్ సేన తదితర సంస్థలు ఉన్నాయి. వీరు తీవ్రవాదం పైన ప్రజలను, యువతను జాగృతం చేయనున్నారు.

తీవ్రవాదం పైనే పోరు.. ముస్లీంల పైన కాదు
శ్రీరామ్ సేన అధ్యక్షులు ప్రమోద్ ముతాలిక్ వన్ ఇండియాతో మాట్లాడుతూ... భారత్‌కు ప్రమాదకరంగా మారుతున్న ఐసిస్ పైన పోరాడేందుకు తామందరం ఒకేతాటి పైకి వచ్చామని చెప్పారు. అయితే, తమ పోరాటం కేవలం తీవ్రవాదం పైనే అని, ముస్లీంల పైన మాత్రం కాదన్నారు.
తీవ్రవాదం పైన పోరాడాలనుకుంటున్న ముస్లీంలు లేదా ముస్లీం సంస్థలు కూడా తమ గ్రూప్‌లో చేరవచ్చునని చెప్పారు. ఐసిస్ ప్రభావిత ప్రాంతాలను తాము గుర్తిస్తామని, తద్వారా జాగృతం చేస్తామన్నారు. యువత ఐసిస్‌లో చేరకుండా ఉండేలా చూస్తామన్నారు.
ఐసిస్ పైన అందరికీ అవగాహన కల్పించవలసిన అవసరం ఉందని చెప్పారు. ఐసిస్ దుర్మార్గపు అజెండాను తెలియజేయాలన్నారు. ఇస్లామిక్ స్టేట్ దుర్మార్గపు చర్యలను ఆమోదించేది లేదని అభిప్రాయపడ్డారు. త్వరలో తాము ఐసిస్ దారుణాలకు వ్యతిరేకంగా ప్రచారం చేస్తామన్నారు. అయితే, తమ ఉద్దేశ్యం మత ఉద్రిక్తత కల్పించాలని కాదన్నారు. ఐసిస్ లేని భారత్‌గా ఉండాలన్నారు.












Click it and Unblock the Notifications