ఘోర పడవ ప్రమాదం: 43 మంది మృతి, 800 మందిని కాపాడారు
ఇటలీ దేశంలో పెను విషాద ఘటన చోటు చేసుకుంది. ఇటలీ సముద్ర తీరంలో ఓ పడవ ధ్వంసమై.. 43 మంది వలసదారులు మృతి చెందారు.
రోమ్: ఇటలీ దేశంలో పెను విషాద ఘటన చోటు చేసుకుంది. ఇటలీ సముద్ర తీరంలో ఓ పడవ ధ్వంసమై.. 43 మంది వలసదారులు మృతి చెందారు. దేశ దక్షిణ తీరంలో వారి మృతదేహాలు లభ్యమైనట్లు ఇటాలియన్ కోస్ట్‌గార్డ్ పేర్కొంది.
మృతుల్లో నెలల వయస్సున్న ఓ శిశువు కూడా ఉందని తెలిపింది. ఇక్కడి కాలాబ్రియాలోని తీర ప్రాంత పట్టణం క్రోటోన్ సమీపంలో.. అయోనియన్ సముద్రంలో 120 మందికిపైగా వలసదారులతో వెళ్తున్న పడవ ప్రమాదానికి గురైనట్లు మీడియాలో కథనాలు వెలువడ్డాయి.

కోస్ట్ గార్డ్, సరిహద్దు పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది పరస్పర సమన్వయంతో ముమ్మరంగా సహాయక చర్యలు చేపట్టాయి. ఈ ఘటనలో ఆదివారం ఉదయం నాటికి దాదాపు 800 మంది ప్రాణాలతో బయటపడినట్లు సహాయక చర్యల్లో పాల్గొన్న సిబ్బంది తెలిపారు.
ఇంకా అనేకమంది బాధితుల ఆచూకీ లభ్యం కాలేదని, మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని అధికారులు వెల్లడించారు. అయితే, ఈ పడవలోని వలసదారులు ఎక్కట్నుంచి బయల్దేరారు? ఏ దేశాలకు చెందినవారో? తెలియరాలేదు. కాగా, సాధారణంగా కాలాబ్రియాకు చేరుకునే వలస నౌకలు.. టర్కీ, ఈజిప్టు తీరాల నుంచి వస్తుంటాయి. ఇటీవల టర్కీలో పెను భూకంపం సంభవించి 45వేల మందికిపైగా మరణించిన విషయం తెలిసిందే. టర్కీ వలసదారులేనా? అనేది తెలియాల్సి ఉంది.
Shocking and sad news from Calabria, in Southern Italy: reports talk about several dead people, including children, after a migrant shipwreck.
— Francesco Rocca (@Francescorocca) February 26, 2023
Italian #RedCross @crocerossa volunteers are responding.
No one should risk his/her life to find a safe place where to stay. pic.twitter.com/vZs4J3Iv3l
-
ఒంటి పూట బడుల వేళల్లో మార్పు, ఇక నుంచి..!? -
అండగా నిలిచిన భారత్ కు థ్యాంక్స్: ఇరాన్ సంచలన ప్రకటన -
మూడేళ్లకోసారి వచ్చినా.. పెట్టిన 150 రూపాయలకు న్యాయం చేస్తావ్ అన్నా.. -
రేషన్ సరఫరా లో కీలక మార్పులు, తాజా మార్గదర్శకాలు..!! -
దేశవ్యాప్తంగా 14 అర్ధరాత్రి నుంచి పెట్రోల్ ధరలు పెంపు..? ఏఏ నగరాల్లో ఎంత పెరుగుతుంది..? -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- ఆందోళనకరం -
విశాఖ - సికింద్రాబాద్ వందే భారత్ కు మరో హాల్ట్, ఆ 9 ఎక్స్‌ప్రెస్ లు ఇక రెగ్యులర్ గా..!! -
రూపాయి పని అయిపోయిందా? చరిత్ర చూడని పతనం! -
గుడ్ న్యూస్: రోడ్ ట్యాక్స్ లేదు.. రిజిస్ట్రేషన్ ఫీజు సగమే! -
10th Class Results అప్పుడే..! పది ఫలితాలపై కీలక ప్రకటన -
Tamil Nadu Election: అంతుబట్టని విజయ్ తీరు..! తెరవెనుక ఏం జరుగుతోంది ? -
ఆర్టీసీ బస్సుల బంద్ - జేఏసీ కీలక పిలుపు..!!












Click it and Unblock the Notifications