పాకిస్తాన్‌ను తాకిన భూకంపం: వణికిపోయిన ప్రజలు
పెషావర్: తాజాగా పాకిస్తాన్‌ను భూకంపం తాకింది. అయితే, అది పెను తుఫాను కాకపోవడంతో కాస్తా ఊపిరి లభించినట్లయింది. రెక్టార్ స్కేలుపై అది 5.5గా నమోదైంది. పాకిస్తాన్ వాయువ్య ప్రాంతంలోని ఖైబర్ పఖ్తుంఖ్వా ప్రావిన్స్‌లో మంగళవారం భూకంపం సంభవించింది. దాంతో ప్రజలు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు.
తజికిస్తాన్ సరిహద్దు సమీపంలోని హిందుకుష్ పర్వత శ్రేణుల్లో 144 కిలోమీటర్ల లోతులో భూకంపం కేంద్రీకృతమైంది. మలకండ్, స్వాత్, ఎగువ దిగువ దీర్ జిల్లాల్లో భూప్రకంపనలు చోటు చేసుకున్నాయి.

ప్రాణనష్టం గానీ, ఆస్తి నష్టం గానీ సంభవించినట్లు సమాచారం లేదు. నేపాల్‌ను పెను భూకంపం అతలాకుతులం చేసిన నేపథ్యంలో పాకిస్తాన్‌లో భూకంపం చోటు చేసుకుంది. నేపాల్‌నే కాకుండా భారత్, చైనాలను కూడా భూకంపం తాకింది.
పాకిస్తాన్‌లో 2013లో భారీ భూకంపం చోటు చేసుకుంది. అది రెక్టార్ స్కేలుపై 7.7గా నమోదైంది. బెలూచిస్తాన్ ప్రాంతంలో అది సంభవించింది. అప్పుడు 500 మంది మరణించారు. అత్యంత దారుణమైన భూకంపం పాకిస్తాన్‌లో 2005లో సంభవించింది. ఈ భూకంపంలో 73 వేల మంది మరణించారు.












Click it and Unblock the Notifications