ఆప్గనిస్థాన్‌లో భూకంపం: భారత్‌లో ప్రకంపనలు
న్యూఢిల్లీ: ఆప్గనిస్థాన్‌లో శనివారం భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై భూకంప తీవ్రత 5.3గా నమోదైంది. హిందూకుష్ పర్వత ప్రాంతాల్లో భూకంప కేంద్రం కేంద్రీకృతమై ఉందని పాకిస్థాన్ రేడియో పేర్కొంది. ఆప్గనిస్థాన్‌లో సంభవించిన భూకంపానికి ఉత్తర భారతదేశం కూడా ప్రకంపనలు పుట్టాయి.
భూకంప తీవ్రత పాకిస్థాన్‌లోనూ స్పష్టంగా కనిపించింది. పెషావర్‌లో ప్రజలు ఆందోళనకు గురయ్యారు. ఇళ్లు, ఆఫీసుల నుంచి జనం భయంతో పరుగులు తీశారు. ఖైబర్-పక్తున్కా ప్రాంతంలో భూకంప తీవ్రత ఎక్కుగా ఉంది. మొబైల్, ఇంటర్నెట్ సేవలకు ఆటంకం ఏర్పడింది.

చైనాలో భూకంప తీవ్రత 5.3గా నమోదు
చైనాలో కూడా శనివారం భూకంపం సంభవించింది. ఈశాన్య చైనాలోని హీలాంగ్జింగ్ ప్రావిన్స్‌లోని లింక్ ఓయులో భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేల్‌పై దీని తీవ్రత 6.4గా నమోదు అయిందని చైనా భూకంప కేంద్ర సంస్థ శనివారం వెల్లడించింది.
అయితే ఈ భూకంపం వల్ల జరిగిన ఆస్తి, ప్రాణ నష్టం గురించి సమాచారం తెలియరాలేదని పేర్కొంది. కాగా, శుక్రవారం ఆర్థరాత్రి ఈ భూకంపం సంభవించిందని, ఆ తర్వాత ఆ ప్రాంతంలో వివిధ మార్గాల్లో నడుస్తున్న పలు రైళ్లను సురక్షిత ప్రాంతంలో నిలిపివేసినట్లు హర్బెన్ రైల్వే బ్యూరో పేర్కొంది.












Click it and Unblock the Notifications