వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

70మిలియన్ ఏళ్ల నాటి డైనోసార్ గుడ్లు: చైనాలో కనుగొన్న పరిశోధకులు..

గుండ్రని ఆకారంలో ఉన్న ఈ డైనోసార్ గుడ్లు ఎర్రని ఇసుక నేల కింద 8మీటర్ల లోతున మట్టితో కప్పబడి ఉన్నాయి. బయటపడ్డ ఐదు గుడ్లలో మూడు ధ్వంసమై ఉన్నట్లుగా శాస్త్రవేత్తలు గుర్తించారు.

|
Google Oneindia TeluguNews

బీజింగ్‌: ఫైటోఫాగస్‌ అనే డైనోసార్‌ జాతికి చెందిన అతి పురాతన గుడ్లు చైనాలో వెలుగుచూశాయి. ఈ పురాతన డైనోసార్ గుడ్లు దాదాపు 70మిలియన్ ఏళ్ల క్రితం నాటివని శాస్త్రవేత్తలు నిర్దారించారు. గ్నేయ చైనాలోని ఫోషన్‌ ప్రాంతానికి సమీపంలో పరిశోధకులు చేపట్టిన తవ్వకాల్లో ఈ డైనోసార్ గుడ్లు బయటపడ్డాయి.

గుండ్రని ఆకారంలో ఉన్న ఈ డైనోసార్ గుడ్లు ఎర్రని ఇసుక నేల కింద 8మీటర్ల లోతున మట్టితో కప్పబడి ఉన్నాయి. బయటపడ్డ ఐదు గుడ్లలో మూడు ధ్వంసమై ఉన్నట్లుగా శాస్త్రవేత్తలు గుర్తించారు. వీటిపై పరిశోధనలు జరిపి మరిన్ని వివరాలు రాబట్టడానికి ప్రయత్నిస్తున్నట్లు చైనాలోని గాంగ్‌డాంగ్స్‌ ఆర్కియాలజీ డిపార్ట్ మెంట్‌కు చెందిన పరిశోధకుడు లిచెంగ్‌ తెలియజేశారు.

70 million-year-old dinosaur egg fossils discovered in China

ఈ పురాతన డైనోసార్ గుడ్లపై పరిశోధనలు జరపడం ద్వారా అప్పటి పరిస్థితులు ఆ కాలం నాటి విలువైన సమాచారం ఏమైనా తెలిసే అవకాశముందని పరిశోధకులు అభిప్రాయపడుతున్నారు.

English summary
Scientists have unearthed five ancient dinosaur egg fossils in China dating back to 70 million years.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X