ఎప్పటికీ నవ్వుతూనే... అరుదైన సమస్య; శాశ్వత చిరునవ్వుతో జన్మించిన పాప
సహజంగా అప్పుడే పుట్టిన పిల్లలు ఏడుస్తూ ఉంటారు. ఎప్పుడైనా అప్పుడప్పుడు నవ్వుతూ కుటుంబ సభ్యులకు నవ్వుల పువ్వులను పూయిస్తారు. కానీ ముఖంపై చెదరని శాశ్వత చిరునవ్వుతో పుట్టిన ఓ పాప ఇప్పుడు అందరితో నవ్వుల పువ్వులను పూయిస్తోంది. కానీ ఆ నవ్వే తల్లిదండ్రులను ఆందోళనలో పడేసింది.

శాశ్వత చిరునవ్వు ... అరుదైన సమస్యతో జన్మించిన శిశువు
అసలేం జరిగిందంటే ఆస్ట్రేలియాకు చెందిన దంపతులు క్రిస్టినా వెర్చర్, బ్లైయిజ్ ముచా దంపతులకు గత ఏడాది డిసెంబర్ నెలలో జన్మించిన పాప ఐలా సమ్మర్ ముచా. గర్భస్థ శిశువుగా ఉన్నప్పటినుండి ఓ అరుదైన సమస్యతో బాధపడుతున్న ఐలా శాశ్వత చిరునవ్వుతో జన్మించింది. ఐలా సమ్మర్ ముచా డిసెంబర్ 2021లో బైలేటరల్ మాక్రోస్టోమియాతో జన్మించింది. ఈ అరుదైన మాక్రోస్టోమియాతో గర్భధారణ సమయంలో నోటి మూలలు కలిసి ఉండవు.

నవ్వుతున్న పాపను చూసి అయోమయంలో తల్లిదండ్రులు
ఇక ఈ విషయాన్ని గర్భస్థ దశలో అల్ట్రాసౌండ్ స్కాన్ లో కూడా తాను గుర్తించలేదని వైద్యులు వెల్లడించారు. నోటి మూలలు కలిసి ఉండకపోవడం వల్ల చిన్నారి నోరు పెద్దగా తెరిచి ఉంటుందని, ఫలితంగా పాలు తాగడం, ఆహారం తీసుకోవడం వీలుపడదని వైద్యులు చెబుతున్నారు. అయితే ఈ అరుదైన సమస్యకు చికిత్స తమవద్ద లేదని అంటున్నారు. ఇక తల్లిదండ్రులు నవ్వుతూనే ఉన్న తమ పాపను చూసి ఏడవాలో ? నవ్వాలో అర్ధం కాని స్థితికి వెళ్ళిపోయారు.

ప్రపంచ వ్యాప్తంగా ఇలా అరుదైన సమస్యతో ఉన్న చిన్నారులు 14 మందే
ప్రపంచవ్యాప్తంగా కేవలం 14 కేసులు మాత్రమే ఈ పరిస్థితితో నమోదయ్యాయని తెలిపారు. తల్లిదండ్రులు క్రిస్టినా వెర్చెర్, మరియు ఆమె భర్త బ్లేజ్ ముచా, పాలివ్వడం సాధ్యం కానందున ఆమె విశాలమైన చిరునవ్వును సరిచేయడానికి శస్త్రచికిత్సపై వైద్యులతో మాట్లాడుతున్నారు. ఇక ఈ అరుదైన స్థితిపై మరింత సమాచారం కోసం అన్వేషణలో భాగంగా, అవగాహన పెంచుకోవడానికి, తల్లిదండ్రులు తమ అనుభవాలను పంచుకోవడానికి సోషల్ మీడియాను వేదికగా చేసుకున్నారు.

శాశ్వత చిరునవ్వు ఎఫెక్ట్ .. ఆహారం తీసుకోలేని స్థితిలో పాప.. సర్జరీ కోసం తల్లిదండ్రుల ప్రయత్నాలు
శాశ్వత చిరునవ్వు ముఖంపై ఉంటే పరవాలేదు కానీ ఆహారం తీసుకోలేని పరిస్థితికి, కనీసం పాలు కూడా తాగలేని పసికందు స్థితికి తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఆపరేషన్ చేయించాలని నిర్ణయించుకున్నారు. ప్రస్తుతం ఈ జంట సోషల్ మీడియా ద్వారా తమ బిడ్డ పరిస్థితిని, ఇలాంటి పరిస్థితిని తాము ఎలా ఎదుర్కొంటున్నామన్న విషయాలను తెలియజేస్తున్నారు. అయితే శాశ్వత చిరునవ్వుతో పుట్టిన బిడ్డ పరిస్థితి తెలిసి కూడా కొందరు దారుణంగా ట్రోల్ చేస్తున్నారు. దీనిపై పసికందు తల్లి స్పందిస్తూ మనిషికి ఏడుపు ఒక శాపం, నా బిడ్డకు నవ్వు ఒక వరం అంటూ చెబుతోంది. నా బిడ్డను చూసి నవ్వే వాళ్ళను నవ్వనివ్వండి అంటూ సమాధానమిస్తుంది.












Click it and Unblock the Notifications