రాత్రిని పగలుగా మార్చేసిన భారీ ఉల్క: అద్భుతమైన వీడియోలు

ఓ రకాసి ఉల్క స్పెయిన్, పోర్చగుల్ గగనతలంలోంచి దూసుకెళ్తూ అద్భుత దృశ్యాన్ని ఆవిష్కరించింది. నీలిరంగులోని భారీ ఉల్క భూమిపై పడింది. ఆ సమయంలో వచ్చిన వెలుగు కాంతులు పగలును తలపించడం గమనార్హం. ఒక్కసారిగా చోటు చేసుకున్న ఈ అద్భుత దృశ్యాన్ని చూసిన జనమంతా సంభ్రమాశ్చర్యాలకు గురయ్యారు.

ఈ ఉల్కతో వచ్చిన వెలుగు కొన్ని వందల కిలోమీటర్ల దూరం కనిపించినట్లు వార్తలు వస్తున్నాయి. అయితే, ఈ ఉల్క ఎక్కడ నేలను తాకిందో ఎవరూ ఖచ్చితంగా చెప్పలేకపోతున్నారు. ఇది, క్యాస్ట్రో డైరో ప్రాంతంలో పడినట్లు ప్రచారం జరుగుతోంది. అయితే, దీనిపై స్పష్టత రావాల్సి ఉంది.

A big meteorite crossing the Portugal and Spain sky video goes viral

కాగా, ఈ ఉల్క గమనానికి సంబంధించిన దృశ్యాలను అటు స్పెయిన్, ఇటు పోర్చుగల్ దేశాల్లోని కొందరు తమ కెమెరాలు, ఫోన్లలో బంధించారు. వాటిని సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు. దీంతో ఉల్క గమనానికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.

ఉల్క పాతాన్ని చూసిన కొందరు నెటిజన్లు తమ స్పందనను పంచుకుంటున్నారు. 'అద్బుతం!! పోర్చుగల్‌పై భారీ ఉల్కాపాతం! ఇలాంటి పరంపరను చూడటం జీవితంలో ఒక్కసారే జరిగే సంఘటన! అది భూమిని ఢీకొట్టి ఉల్కగా మారుతుందా? అనే విషయంపై ఎలాంటి సమాచారం లేదు! వందల మైళ్ల దూరం కూడా కనిపించింది! వావ్' అంటూ ఓ నెటిజన్ వ్యాఖ్యానించాడు.

'వావ్ ఇది ఆకట్టుకుంది, చాలా ప్రకాశవంతంగా ఉంది! రంగును బట్టి ఇది మెగ్నీషియంతో తయారైనట్లు అనిపిస్తుంది' అని రెడ్డిట్‌లో పోస్ట్ చేసిన చిత్రంపై మరో నెటిజన్ చెప్పుకొచ్చాడు.

అసలు ఉల్క అంటే ఏంటి?

ఉల్కలు భూమి వాతావరణం గుండా వెళ్లి భూమిని చేరగల అంతరిక్ష శిలల శకలాలు. చాలా ఉల్కలు గ్రహశకలాల నుంచి ఉద్భవించాయి, ఇవి మార్స్, బృహస్పతి మధ్య ఉల్క బెల్ట్‌లోని రాతి భాగాలు. ఇవి కొన్ని తోకచుక్కల నుంచి వస్తాయి. ఇవి మంచు, ధూళి, రాతి పదార్థాలతో కూడి ఉంటాయి. అరుదుగా, ఉల్కలు చంద్రుడు లేదా మార్స్ నుంచి రావచ్చు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+