Viral Video: ఈ కోతి పనే బాగుంది.. అరటి పండు తింటూ.. వైరల్ అయిన వీడియో..
సోషల్ మీడియాలో జంతువులకు సంబంధించిన వీడియోలు వైరల్ అవుతుంటాయి. ముఖ్యంగా కుక్క, పిల్లి, కోతులకు సంబంధించిన వీడియోలు నెటిజన్లు ఎక్కువగా చూస్తారు. అయితే ఇందులో కోతులు కొంచె ప్రత్యేకమైనవి. అవి కాస్త మనుషుల్లా ప్రవర్తిస్తాయి. తాజాగా ఓ కోతి మనిషలా ఎంజాయ్ చేసింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
3 మిలియన్ల వ్యూస్..
వైరల్ అవుతున్న ఈ వీడియోలో ఓ కోతి తాడుపై అటు ఊగుతూ, అరటి పండు తింటూ ఎంజాయ్ చేస్తుంది. కోత్తి కళ్లాద్దలు కూడా పెట్టుకుంది. కోతి తాడుపై రిలాక్స్‌డ్ పొజిషన్‌లో కనిపిస్తుంది. తలపై పూలు కూడా పెట్టుకుంది.ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ వీడియోకు 3 మిలియన్ల వ్యూస్ వచ్చాయి. 14,000 కంటే ఎక్కువ రీట్వీట్‌లు చేశారు.
He knows how to enjoy life! 💕🤣🤣pic.twitter.com/JUpv2sb8gC
— Figen (@TheFigen) July 25, 2022

నెటిజన్ల కామెంట్లు..
ఈ వీడియోపై నెటిజన్లు కామెంట్ల మీద కామెంట్లు చేస్తున్నారు. " కోతికి డబ్బు ఎవరు ఇచ్చారని నేను ఆశ్చర్యపోతున్నాను" అని ఒకరు కామెంట్ చేయగా.. "అందరికీ శుభోదయం. నేను మీకు మంగళవారం సంతోషంగా, చల్లగా ఉండాలని కోరుకుంటున్నానని కామెంట్ చేశారు. కోతి పని బాగుందని మరొకరు కామెంట్ చేశారు.












Click it and Unblock the Notifications