వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

నియంత కిమ్‌ కోసం చైనా నుంచి నార్త్ కొరియాకు వైద్యబృందం... ఆరోగ్యం విషమించిందా..?

|
Google Oneindia TeluguNews

బీజింగ్/ ఉత్తరకొరియా: గత కొద్ది రోజులుగా ఉత్తరకొరియా అధ్యక్షుడు కిమ్ జాంగ్ ఉన్ ఆరోగ్య పరిస్థితి బాగోలేదంటూ వార్తలు వచ్చాయి. అయితే కిమ్ పరిస్థితి బాగుందని తాను ఉత్తరకొరియా గ్రామీణప్రాంతాల్లో ఉన్నాడంటూ కథనాలు వచ్చాయి. అంతేకాదు ఉత్తరకొరియా శతృదేశం దక్షిణ కొరియా కూడా కిమ్ జాంగ్ ఉన్ బాగానే ఉన్నాడంటూ చెప్పుకొచ్చింది. కానీ అగ్రరాజ్యం అమెరికా మాత్రం కిమ్ ఆరోగ్య పరిస్థితి ఆందోళనకరంగా ఉందంటూ చెప్పుకొచ్చింది. ఇలా ఎవరికి వారు తోచినట్లుగా చెబుతున్నారు. తాజాగా ఉత్తరకొరియాను వెనకేసుకొచ్చే చైనా ఒక వైద్యబృందాన్ని ఉత్తరకొరియాకు పంపినట్లు సమాచారం. దీంతో మళ్లీ కిమ్ ఆరోగ్య పరిస్థితిపై పలు ఊహాగానాలు మొదలయ్యాయి.

Recommended Video

Kim Jong Un Health : China Medical Experts in North Korea For Kim
 మళ్లీ కిమ్ ఆరోగ్యంపై అనుమానాలు.చైనా నుంచి వైద్య బృందం

మళ్లీ కిమ్ ఆరోగ్యంపై అనుమానాలు.చైనా నుంచి వైద్య బృందం

శత్రువుకు శత్రువు మిత్రుడని అమెరికాకు శత్రువైన ఉత్తరకొరియాకు సహాయం చేసేందుకు చైనా ఉపక్రమించింది. అగ్రరాజ్యం అమెరికాను అణుపరీక్షలు నిర్వహించి గడగడలాడించిన ఉత్తరకొరియా అధినేత కిమ్ జాంగ్ ఉన్ ఆరోగ్య పరిస్థితిని సమీక్షించేందుకు చైనా నుంచి నిపుణులతో కూడిన వైద్య బృందం ఉత్తరకొరియాకు వెళ్లినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. వైద్య బృందం హడావుడిగా ఉత్తరకొరియాకు వెళ్లడంపై కిమ్ ఆరోగ్యంపై మళ్లీ నీలినీడలు అలుముకున్నాయి. అయితే ఉత్తరకొరియాకు ఎవరు వెళ్లారనేదానిపై మాత్రం క్లారిటీ ఇవ్వలేదు.

కిమ్ ఆరోగ్య పరిస్థితిపై వస్తున్న వార్తల్లో నిజంలేదన్న పలు దేశాలు

కిమ్ ఆరోగ్య పరిస్థితిపై వస్తున్న వార్తల్లో నిజంలేదన్న పలు దేశాలు

ఇదిలా ఉంటే ఏప్రిల్ 12వ తేదీన దక్షిణ కొరియా నుంచి పనిచేస్తున్న డైలీ ఎన్‌కే అనే వెబ్‌సైట్‌ కిమ్ గుండెసంబంధిత వ్యాధితో బాధపడుతున్నాడని సర్జరీ తర్వాత కోలుకుంటున్నారనే కథనాన్ని ప్రచురించింది. అయితే ఈ వార్తలను చైనా దక్షిణ కొరియా వర్గాలు కొట్టిపారేశాయి. అంతేకాదు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కూడా కిమ్ ఆరోగ్యంపై స్పందిస్తూ వాటిలో నిజం లేదని చెప్పారు. ఇదిలా ఉంటే శుక్రవారం రోజున దక్షిణ కొరియా ఇంటెలిజెన్స్ సంస్థ ప్రపంచానికి ఒక వార్తను విడుదల చేసింది. కిమ్ ఆరోగ్యకరంగానే ఉన్నారంటూ చెప్పుకొచ్చింది. కిమ్ జాంగ్ ఉన్ ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నాడని అయితే విషమంగా ఉందన్న వార్తల్లో నిజంలేదని అమెరికా ఇంటెలిజెన్స్ వర్గాలు స్పష్టం చేశాయి. కిమ్ ఆరోగ్య పరిస్థితిపై స్పష్టమైన సమాచారం లేదని, అయితే పరిస్థితిని మాత్రం సమీక్షిస్తున్నట్లు అమెరికా సెక్రటరీ ఆఫ్ స్టేట్ మైక్ పాంపే చెప్పారు.

ఉత్తరకొరియాకు చైనా అండ

ఉత్తరకొరియాకు చైనా అండ

ఇదిలా ఉంటే ఏప్రిల్ 11 నుంచి కిమ్ జాంగ్ ఉన్ అదృశ్యమైనట్లు సమాచారం. ఎప్పుడూ తన తాత జయంతి ఉత్సవాలకు హాజరుకాకుండా ఉండే కిమ్ ఈ సారి మాత్రం గైర్హాజరయ్యాడు. 2014లో కూడా ఇలానే కనిపించకుండా పోయిన కిమ్ ఆ తర్వాత ఒక నెలకు కుంటుతూ కనిపించాడు. స్వతహాగా చైన్ స్మోకర్ అయినా కిమ్ పలు ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నాడనేది సుస్పష్టం. ఇక తన తండ్రి కిమ్ జాంగ్ ఇల్‌కు 2008లో గుండెపోటు వచ్చినప్పుడు కూడా చైనా నుంచి ఫ్రాన్స్ నుంచి డాక్టర్లు ఉత్తరకొరియాకు వెళ్లి ఆయనకు చికిత్స చేసినట్లు దక్షిణకొరియా మీడియా పేర్కొంది. ఇక గతేడాది చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ ఉత్తరకొరియా పర్యటనకు వెళ్లి అక్కడ కిమ్‌తో సమావేశమయ్యారు. ఉత్తరకొరియాను ఆర్థికంగా ఆదుకుంటామని చెప్పారు.

ఉత్తరకొరియాపై ఐక్యరాజ్యసమితి విధించిన పలు ఆంక్షల నేపథ్యంలో ఆ దేశానికి చైనా ఆర్థికంగా అండగా నిలుస్తోంది. చైనాతో ఉత్తరకొరియా సరిహద్దును పంచుకుంటుంది. 2018 నుంచి నాలుగుసార్లు కిమ్ జాంగ్ ఉన్ చైనాలో పర్యటించారు.

English summary
China has sent a team including medical experts to North Korea to advise on the hermit state’s leader Kim Jong-un, according to three people familiar with the situation.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X