వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మిగ్-21 వర్సెస్ ఎఫ్-16 ఫైటర్ జెట్‌: రష్యా నిపుణుడు చెబుతున్నదేంటి..?

|
Google Oneindia TeluguNews

మాస్కో: కొద్ది రోజుల క్రితం భారత్ పాకిస్తాన్‌ల మధ్య యుద్ధ విమానాలతో పోరుసాగింది. అయితే నేటి ఈ పరిస్థితులు ఆనాటి కోల్డ్ వార్ సందర్భంగా అమెరికా.. అప్పటి సోవియట్ రష్యాల మధ్య నెలకొన్న యుద్ధ వాతావరణాన్ని తలపించాయి. ఇక ఇదే విషయాన్ని ధృవీకరిస్తున్నారు రష్యాకు చెందిన నేషనల్ డిఫెన్స్ మ్యాగజీన్ ఎడిటర్ ఇన్ ఛీఫ్ ఇగోర్ కొరోష్నెకో. ఆయన చెబుతున్న ప్రకారం భారత గగనతలంలోకి వచ్చిన పాకిస్తాన్ ఎఫ్-16 యుద్ధ విమానాలను తరుముకుంటూ వెళ్లిన మిగ్ -21 యుద్ధ విమానాలు ఏమాత్రం తీసిపోవని చెప్పారు.

A touch of Cold War: India’s MiG-21 upgraded by Russia equal to Pak’s US-made F-16, says analyst

పాకిస్తాన్ యుద్ధ విమానాలు ఎఫ్ -16 భారత్‌ వినియోగించిన మిగ్-21 కంటే సాంకేతికంగా బలంగా ఉన్నాయనే వాదనలు వస్తున్న నేపథ్యంలో ఇగోర్ కొరోష్నెకో వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. అమెరికా రూపొందించిన ఎఫ్-16 యుద్ధ విమానాల కంటే మిగ్ -21 యుద్ధ విమానాలు ఏమాత్రం తీసిపోవని వ్యాఖ్యానించారు. మిగ్-21 యుద్ధ విమానాలను రష్యా అప్‌గ్రేడ్ చేయడంతో ఎఫ్-16 ఫైటర్ జెట్స్‌‌తో పోటీ పడే సామర్థ్యం ఉందని వెల్లడించారు. ఇదిలా ఉంటే... మిగ్-21 యుద్ధ విమానంను పాకిస్తాన్ ఫైటర్ జెట్ ఎఫ్-16 కూల్చివేసింది.

పాపిష్టి పాక్ : మళ్లీ భారత గగనతలంలో పాక్ యుద్ధ విమానం..కూల్చివేసిన వాయుసేన..?పాపిష్టి పాక్ : మళ్లీ భారత గగనతలంలో పాక్ యుద్ధ విమానం..కూల్చివేసిన వాయుసేన..?

పాక్ యుద్ధ విమానం ఎఫ్-16 భారత్‌కు చెందిన మిగ్ -21 యుద్ధ విమానం కూల్చగానే అందులోని వింగ్ కమాండర్ అభినందన్ వర్థమాన్ కిందకు దూకి ప్రాణాలను కాపాడుకున్నారు. అయితే పాకిస్తాన్ భూభాగంలో పడిపోవడంతో ఆ సైన్యానికి పట్టుబడ్డాడు. ఇక మిగ్ -21ను రష్యా అప్‌గ్రేడ్ చేయడంతో అందులో రాడార్, గగనతలం నుంచి గగనతలంలో క్షిపణ దాడి చేయగల వ్యవస్థ వచ్చాయని...ఇవి ఎఫ్-16 యుద్ధవిమానంలో ఉన్న వ్యవస్థతో సమానంగా పనిచేస్తాయని ఇగోర్ వెల్లడించారు. అంతేకాదు మిగ్-21-93 యుద్ధ విమానాలను అప్‌గ్రేడ్ చేశాకా వాటిని మిగ్-21 యూజీపీ బైసన్ అని పిలుస్తున్నామని వెల్లడించారు. అప్‌గ్రేడ్ అయిన మిగ్ యుద్ధ విమానంలో రాడార్, అత్యాధునిక క్షిపణి వ్యవస్థ, విండ్ షీల్డ్‌పై ఆధునిక ఇండికేటర్లు, కాక్‌పిట్‌లో మల్టీ ఫంక్షనల్ డిస్ప్లే‌లాంటివి అదనంగా వచ్చి చేరాయని ఇగోర్ స్పష్టం చేశారు. ఇక కోటింగ్ రాడార్ విజిబిలిటీని తగ్గిస్తుందని ...విమానం యొక్క జీవితకాలం కూడా కొత్త వెర్షన్‌తో పెరిగిందని చెప్పారు.

English summary
The recent air skirmishes between India and Pakistan looks to rekindle the memory of the Cold War rivalry between the US and erstwhile Soviet Union/Russia. Days after India’s MiG-21 clashes with Pakistan’s US-made F-16, editor-in-chief of National Defense magazine Igor Korotchenko said the MiG-21 fighter jets upgraded by Russia have the combat capabilities identical to those of F-16, Russia’s TASS news agency reported.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X