Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

ఆఫ్ఘనిస్తాన్‌లో అయిదుమంది జర్నలిస్టులు జైలుకు: జస్ట్.. దాన్ని కవర్ చేసినందుకే!

కాబుల్: ఆఫ్ఘనిస్తాన్‌లో తాలిబన్ల ఆకృత్యాలకు అడ్డు, అదుపు లేకుండా పోతోంది. ఆ దేశాన్ని ఆక్రమించుకున్న అతి కొద్దిరోజుల్లోనే తమ తడాఖా చూపడం ఆరంభించారు. విదేశీయులు, తమకు ఎదురు తిరిగుతున్న వారి కోసం ఇంటింటినీ గాలిస్తోన్న తాలిబన్లు మరో అడుగు ముందుకేశారు. పత్రికా స్వేచ్ఛ, మీడియా ప్రతినిధుల హక్కులను కాపాడతామని, వారిని అడ్డుకోబోమంటూ ప్రకటన చేసి- కనీసం 24 గంటలు కూడా గడవక ముందే విజృంభించారు. అయిదుమంది జర్నలిస్టులను అరెస్ట్ చేశారు. వారిని కటకటాల వెనక్కి నెట్టారు.

ప్రింట్ మీడియా రిపోర్టర్ల అరెస్ట్..


ఎటిలాట్‌రోజో అనే దినపత్రికలో పని చేస్తోన్న జర్నలిస్టులు ఆ అయిదుమంది కూడా. వారిని తాలిబన్లు అరెస్ట్ చేసినట్లు మరో మీడియా హౌస్ టోలో న్యూస్ తెలిపింది. ఆప్ఘనిస్తాన్‌లో అతిపెద్ద టెలివిజన్ నెట్‌వర్క్ ఉన్న ఈ సంస్థ.. ఆ జర్నలిస్టుల అరెస్ట్‌పై ఓ కథనాన్ని ప్రసారం చేసింది. తమ జర్నలిస్టులను అరెస్ట్ చేసిన విషయాన్ని ఎటిలాట్‌రోజ్ దినపత్రిక చీఫ్ ఎడిటర్ జకీ దర్యాబి నిర్ధారించారు. తమ సంస్థలో పనిచేసే రిపోర్టర్లను తాలిబన్లు అరెస్ట్ చేశారని తెలిపారు.

 ప్రదర్శనలను కవర్ చేసినందుకు..

ప్రదర్శనలను కవర్ చేసినందుకు..

రాజధాని కాబుల్‌లో నిరసన ప్రదర్శనలు కొనసాగుతోన్న విషయం తెలిసిందే. పాకిస్తాన్‌ గో బ్యాక్ అంటూ స్థానికులు నినదిస్తోన్నారు. కాబుల్‌లోని ఆ దేశ కార్యాలయం వద్ద భారీ ప్రదర్శన నిర్వహించారు. తమ దేశ కార్యకలాపాలు, తాలిబన్ ప్రభుత్వ ఏర్పాటు వ్యవహారాల్లో పాకిస్తాన్ జోక్యం చేసుకోవడాన్ని వ్యతిరేకిస్తూ పలువురు స్థానికులు ఈ నిరసన ప్రదర్శనలను నిర్వహించారు. పాకిస్తాన్‌కు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ప్లకార్డులను ప్రదర్శించారు.

20 నుంచి 30 ఏళ్లలోపు వారే..

దీన్ని కవర్ చేసినందుకే ఆ అయిదుమంది రిపోర్టర్లను తాలిబన్లు అరెస్ట్ చేసినట్లు టోలో న్యూస్ తెలిపింది. వారి పేర్లు, ఇతర వివరాలు ఇంకా అందాల్సి ఉందని పేర్కొంది. వారిపై నమోదు చేసిన కేసుల వివరాల గురించి తెలుసుకునే ప్రయత్నం చేస్తోన్నామని స్పష్టం చేసింది. అరెస్టయిన అయిదుమందిలో అందరూ పురుషులేనని, వారి వయస్సు 20 నుంచి 30 సంవత్సరాల్లోపే ఉంటుందని భావిస్తున్నట్లు తెలియజేసింది. వారిని ఎప్పుడు న్యాయస్థానం ముందు ప్రవేశపెడతారనేది తెలియరాలేదని టోలో న్యూస్ వివరించింది.

పత్రికా స్వేచ్ఛకు భంగం..

పత్రికా స్వేచ్ఛకు భంగం..

పత్రికా స్వేచ్ఛ, మీడియా ప్రతినిధుల హక్కలకు ఎలాంటి భంగం వాటిల్లబోదంటూ తాలిబన్లు మంగళవారమే ప్రకటించిన విషయం తెలిసిందే. కొత్త ప్రభుత్వ ఏర్పాటుకు సంబంధించిన వివరాలను వెల్లడించిన ప్రెస్‌ కాన్ఫరెన్స్‌లో తాలిబన్ల అధికార ప్రతినిధి, ఆప్ఘనిస్తాన్ సమాచార శాఖ మంత్రి దీనిపై ఓ విస్పష్టమైన ప్రకటన సైతం చేశారు. ఆ ప్రకటన చేసి 24 గంటలు కూడా గడవక ముందే ఏకంగా అయిదుమంది జర్నలిస్టులు కటకటాల వెనక్కి వెళ్లడం కలకలం రేపుతోంది.

 చెప్పేదొకటి చేసేదొకటి..

చెప్పేదొకటి చేసేదొకటి..

కొత్తగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి సిద్ధపడుతోన్న తాలిబన్లు.. మాటల్లో చెప్పేదొకటి, కార్యాచరణలో చేసేది ఒకటిగా కనిపిస్తోందనే విమర్శలు వ్యక్తమౌతోన్నాయి. తమ ఉద్దేశం ఏమిటో.. పరిపాలన ఎలా ఉండబోతోందో.. తెలియజేసేలా తాలిబన్ల తాజా చర్య ఉందనే అభిప్రాయాలు నెలకొన్నాయి. ప్రతికా స్వేచ్ఛను కాపాడటాన్ని తమ బాధ్యతగా భావిస్తామంటూ తాలిబన్ల అధికార ప్రతినిధి ప్రకటన చేసిన కొద్దిసేపటికే- నిరసల ప్రదర్శనలను కవర్ చేస్తోన్న మీడియా ప్రతినిధులను అరెస్ట్ చేయడం పట్ల తీవ్రంగా విమర్శలు చేస్తోన్నారు నెటిజన్లు.

జర్నలిస్ట్ సంఘాల్లో ఆందోళన..

జర్నలిస్ట్ సంఘాల్లో ఆందోళన..

ఇక మహిళల హక్కుల మీద కూడా తాలిబన్లు ఇలాంటి వైఖరినే అనుసరిస్తారని చెబుతున్నారు. షరియా చట్టాన్ని ఇదివరకట్లాగే యధాతథంగా అమలు చేస్తామంటూ తాలిబన్ ప్రతినిధులు ఇదివరకే ప్రకటించారు. దానికి అనుగుణంగానే ఈ తాజా అరెస్టులు నమోదయ్యాయని జర్నలిస్ట్ సంఘాల ప్రతినిధులు ఆవేదన వ్యక్తం చేస్తోన్నారు. ఇంతకుముందే- కొందరిని అరెస్ట్ చేసి, కొన్ని గంటల పాటు నిర్బంధించారని గుర్తు చేస్తోన్నారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+