ఆప్ఘన్‌లో భారీ పేలుడు.. గురుద్వారా రోడ్‌లో శబ్దం..
కాబూల్‌లో భారీ పేలుడు జరిగింది. కర్తే పర్వాన్ వద్ద గల గురుద్వారా రోడ్ వద్ద పేలుడు సంభవించింది. ఆప్ఘన్ కాలమానం ప్రకారం సాయంత్రం 4.15 గంటలకు పేలుడు శబ్దం వినిపించింది. ఘటనా స్థలాన్ని పోలీసులు సీజ్ చేశారు. ఇతరులను ఎవరినీ రానీయలేదు. సాయంత్రం పూట జనాలు తిరిగే సమయంలో పేలుడు జరిగింది. కానీ ప్రాణ నష్టం మాత్రం సంభవించలేదు. కడపటి వార్తలు అందే సమయానికి వివరాలు తెలియరాలేదు. పేలుడు జరిగిన సమయంలో జన సమ్మర్థం ఎక్కువగా ఉందని ప్రత్యక్ష సాక్షి పారుఖ్ షా వివరించారు. ఆప్ఘన్‌లో తాలిబన్ల 100 రోజుల పాలన ముగిసిన మరుసటి రోజు మరో పేలుడు జరిగింది. ఆప్ఘన్‌లో రోజు రోజుకు పరిస్థితి దిగజారుగుతోంది. దీనికి సంబంధించి అకాళిదల్ ట్వీట్ చేసింది. ఆప్ఘన్‌లో పరిస్థితులు మారలేదని పేర్కొంది.
Recommended Video
ISL 2020-21: Kerala Blasters VS Jamshedpur FC play out 0-0 Draw













Click it and Unblock the Notifications