తాలిబన్ల అరాచకాలు పీక్స్‌కి-మహిళల శవాలతోనూ సెక్స్-ప్రతీ ఇంటి నుంచి ఆడవాళ్లు తమతో రావాల్సిందేనని...
ఆఫ్గనిస్తాన్‌ను తాలిబన్లు వశం చేసుకున్నాక అక్కడ అడుగడుగునా అరాచకం రాజ్యమేలుతోంది. తాలిబన్ల రాజ్య స్థాపన ముఖ్యంగా మహిళల మనుగడకే పెద్ద ముప్పులా పరిణమించింది. షరియా చట్టాలకు లోబడి వారి హక్కులను గౌరవిస్తామని.. కాపాడుతామని చెప్పిన తాలిబన్లు... ఎక్కడా ఆ మాటను నిలుపుకోవడం లేదు. సరికదా.. మహిళల పట్ల వారి అరాచకాలు శృతిమించిపోయాయి. మహిళలను హింసించడం,సెక్స్ బానిసలుగా మార్చడమే కాదు.. ఆఖరికి వారి శవాలను కూడా సెక్స్ డాల్స్‌లా ఉపయోగిస్తున్నారు. పలు అంతర్జాతీయ మీడియా సంస్థలు ఈ విషయాన్ని బయటపెట్టాయి. తాజాగా ఆఫ్గనిస్తాన్ నుంచి భారత్ వచ్చిన ఓ మహిళ కూడా ఇదే విషయాన్ని వెల్లడించింది.

విస్తుపోయే విషయాలు...
ఆఫ్గనిస్తాన్ పోలీస్ శాఖలో పనిచేసిన మస్కన్ అనే మహిళ ఇటీవల ఢిల్లీకి చేరింది. ఆఫ్గనిస్తాన్‌లో చిక్కుకుపోయిన భారతీయులను భారత్‌కు తరలిస్తున్న నేపథ్యంలో... వారితో పాటు కొంతమంది ఆఫ్గన్లు కూడా ఇక్కడికి వస్తున్నారు. సరైన డాక్యుమెంట్స్,అనుమతులు ఉన్న ఆఫ్గన్లను భారత్‌కు అనుమతిస్తున్నట్లు తెలుస్తోంది. ఢిల్లీకి చేరిన మస్కన్ అనే ఆ మహిళ ఆఫ్గన్‌లో తాలిబన్ల అరాచకాలపై విస్తుపోయే విషయాలు బయటపెట్టారు.

శవంతోనూ తాలిబన్ల సెక్స్...
ప్రతీ ఇంటి నుంచి ఆడవాళ్లు తమతో రావాల్సిందేనని తాలిబన్లు అక్కడి కుటుంబాలను వేధిస్తున్నట్లు మస్కన్ తెలిపారు. మాట వినని వారిని చంపేసైనా వారితో తీసుకెళ్తున్నారని చెప్పారు. మనిషికి ప్రాణం ఉందా లేదా అన్నది వారికి ముఖ్యం కాదు... ఆ మనిషి ఆడదైతే చాలు... శవంతోనూ సెక్స్ చేస్తారని పేర్కొన్నారు. ఇలా శవాలతోనూ సెక్స్ చేయడాన్ని నెక్రోఫిలియా అని పిలుస్తారు. ఆఫ్గనిస్తాన్‌లోని తాలిబన్లకు ఇది అలవాటేనని చెబుతున్నారు.

తన తండ్రిని,అంకుల్‌ను చంపేశారని...
జిహాదిస్ట్ గ్రూప్ తనను,తన కుటుంబాన్ని కూడా బెదిరింపులకు గురిచేసిందని మస్కన్ తెలిపారు. తాను ఉద్యోగానికి వెళ్తే తన కుటుంబానికి ముప్పు తప్పదని బెదిరించారన్నారు. ఆఫ్గనిస్తాన్‌లో ఏ మహిళ ప్రభుత్వం కోసం పనిచేసినా విపత్కర పరిస్థితిని ఎదుర్కోక తప్పని పరిస్థితులు ఇప్పుడక్కడ నెలకొన్నాయని చెప్పారు. ఆఫ్గన్ నుంచి వచ్చిన మరో మహిళ మాట్లాడుతూ... తాను పోలీస్ శాఖలో పనిచేస్తున్నాననే కారణంతో తన తండ్రిని తాలిబన్లు కాల్చి చంపేశారని ఆవేదన వ్యక్తం చేశారు. డాక్టర్ వృత్తిలో తన అంకుల్‌ని కూడా కాల్చేశారని చెప్పారు.

కిడ్నాప్ చేసి సెక్స్ బానిసలుగా మారుస్తున్నారు...
అంతర్జాతీయ మీడియా కథనాల ప్రకారం... ఇటీవలి కాలంలో ఎంతమంది యువతులను తాలిబన్లు వేధించి,హింసించి,చంపేశారు. ఆ యువతుల శవాలను శవ పేటికల్లో పొరుగు దేశాల్లోని ఇస్లామిక్ తీవ్రవాద సంస్థలకు చేరవేస్తున్నారు. అక్కడి ఉగ్రవాదులు ఆ శవాలను సెక్స్ డాల్స్‌లా ఉపయోగిస్తున్నారు. యువతులను చదువు,ఉద్యోగం మానిపించి... తాలిబన్లు వారిని బలవంతంగా పెళ్లి చేసుకుంటున్నారు.కుదరకపోతే కిడ్నాప్ చేసి సెక్స్ బానిసలుగా మారుస్తున్నారు. ఇటీవల ఓ మహిళ సరిగా వంట చేయలేదనే కారణంతో ఆమెను సజీవ దహనం చేసినట్లు నల్లా అయౌబి అనే మహిళా న్యాయమూర్తి తెలిపారు.

జైళ్లలోనూ ఆకృత్యాలు...
జైళ్లలోనూ తాలిబన్ల ఆకృత్యాలు కొనసాగుతున్నాయి. ఖైదీల తలలు నరకడం,కళ్లు పీకేయడం,వందలాది మందిని ఉరితీయడం చేస్తున్నారు. ఇటీవల ఓ క్రిస్టియన్ వ్యక్తి చర్మం ఒలిచి అతన్ని స్తంభానికి వేలాడదీశారు. ఇవన్నీ భరించలేకనే ఆఫ్గనిస్తాన్లు అక్కడి నుంచి పారిపోయేందుకు ప్రయత్నిస్తున్నారు. అయితే దేశ భౌగోళిక సరిహద్దులు మూసివేయడంతో కాబూల్ విమానాశ్రయం ఒక్కటే దేశం దాటేందుకు ఉన్న ఏకైక ఆప్షన్‌గా మిగిలింది. దీంతో వేలాది మంది కాబూల్ విమానాశ్రయానికి పోటెత్తుతూనే ఉన్నారు. ఇప్పటివరకూ దాదాపు 18వేల పైచిలుకు మందిని ఇక్కడి నుంచి ఆయా దేశాలకు తరలించారు. భారత్,అమెరికా ఇప్పటికీ తమ దేశస్తుల తరలింపు ప్రక్రియను చేపడుతున్నాయి. భారత్ ప్రతీరోజూ ఢిల్లీ నుంచి కాబూల్‌కు రెండు విమాన సర్వీసులు నడిపేందుకు అమెరికా నాటో దళాలు ఇప్పటికే అనుమతినిచ్చాయి.

కోఎడ్యుకేషన్ నిషేధిస్తూ ఫత్వా...
శనివారం(ఆగస్టు 18) తాలిబన్ల నుంచి మొదటి ఫత్వా జారీ అయింది. ఇకపై ప్రభుత్వ,ప్రైవేట్ యూనివర్సిటీల్లో కోఎడ్యుకేషన్‌ను నిషేధిస్తున్నట్లు ఆ ఫత్వాలో పేర్కొన్నారు. సమాజంలోని అన్ని రుగ్మతలకు మూలం కోఎడ్యుకేషన్‌లోనే ఉందన్నారు.ఇప్పటికైతే హెరాత్ ప్రావిన్స్‌లో మాత్రమే ఈ నిషేధాన్ని ప్రకటించారు.హెరాత్ ప్రావిన్స్‌లోని యూనివర్సిటీ ప్రొఫెసర్లు,ప్రైవేట్ వర్సిటీల యాజమాన్యాలతో శనివారం తాలిబన్ అధికారులు సమావేశమై కోఎడ్యుకేషన్‌పై చర్చించారు. సమావేశ అనంతరం కోఎడ్యుకేషన్‌పై నిషేధం విధిస్తున్నట్లు ఫత్వా జారీ చేశారు. తాలిబన్ల విధానాలు మొదటి నుంచి విద్యకు వ్యతిరేకంగానే ఉన్నాయి.ముఖ్యంగా స్త్రీలకు విద్య,ఉద్యోగాలను మొదటి నుంచి వారు నిరాకరిస్తున్నారు.

ఆనాటి చీకటి పాలన మళ్లీ...
1996-2001 వరకు సాగిన తాలిబన్ల పాలనలో స్త్రీలకు హక్కులే లేకుండా పోయాయి. వారికి విద్య,ఉద్యోగాలపై తాలిబన్లు నిషేధం విధించారు. ఇంటి గడప దాటాలంటే మగ తోడు ఉండాల్సిందేనని... అది కూడా కుటుంబ సభ్యులే అయి ఉండాలని ఆంక్షలు పెట్టారు. బలవంతంగా వారికి తాలిబన్ ఫైటర్లతో పెళ్లిళ్లు జరిపించేవారు. స్త్రీ అంటే కేవలం సంతానం కోసమే అనే భావన వారిలో నాటుకుపోయింది.
2001లో తాలిబన్ల పాలన ముగిశాక 2002 నుంచి ఇప్పటివరకూ మిలియన్ల సంఖ్యలో మహిళలు చదువు బాట పట్టారు. తిరిగి సాధారణ జీవితంలోకి వచ్చారు. రాజకీయాల్లోనూ రాణించారు. కానీ ఇప్పుడు దేశం మళ్లీ తాలిబన్ల చేతుల్లోకి వెళ్లడంతో వారి భవిష్యత్ అంధకారంలోకి నెట్టినట్లయింది. అంతర్జాతీయ సమాజం ఆఫ్గనిస్తాన్‌లో స్త్రీల హక్కులపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తోంది.

ఫస్ట్ ప్రెస్ మీట్‌లో ఏం చెప్పారు...
నిజానికి ఇటీవలి తాలిబన్ల మొదటి ప్రెస్‌మీట్‌లో వారి మాటలు కాస్త ఉదారంగా అనిపించాయి. స్త్రీలకు విద్య,ఉద్యోగ రంగాల్లో అవకాశాలు కొనసాగుతాయని వారు ప్రకటించారు. షరియా చట్టాలకు లోబడి వారి హక్కులకు గౌరవం,భద్రత కల్పిస్తామన్నారు. తమకు ఎవరితోనూ శత్రుత్వం లేదని... ఆఖరికి సైన్యంతోనూ ఘర్షణ పడదలుచుకోలేదని చెప్పారు. కానీ కొద్దిరోజులకే వారి అసలు రంగు బయటపడుతోంది. ఆఫ్గనిస్తాన్‌లో ప్రజాస్వామ్యానికి తావు లేదని ఇస్లామిక్ చట్టాలకు లోబడే వ్యవస్థలు,వ్యక్తులు నడుచుకోవాలని ఇటీవల తాలిబన్లు హుకుం జారీ చేశారు. సైనికులను వెతికి పట్టుకుని మరీ చంపేస్తున్నారు. మహిళలపై అత్యాచారాలు,హత్యలకు తెగబడుతున్నారు.












Click it and Unblock the Notifications