భారత్‌కు మూడోసారి సత్య నాదెళ్ల, ఈనెల 30న టూర్
న్యూఢిల్లీ: మైక్రోసాఫ్ట్ సీఈవో సత్య నాదెళ్ల ఈ నెల 30న భారత్ రానున్నారు. కేవలం ఏడు నెలల వ్యవధిలో సత్య నాదెళ్ల భారత్‌కు రావడం ఇది మూడోసారి. ఈసారి పర్యటనలో భాగంగా ఢిల్లీలో జరిగే కార్యక్రమంలో ఆయన యువ వ్యాపారవేత్తలను, విద్యార్థులు, విద్యావేత్తలను కలుసుకుంటారు.
మరో కార్యక్రమంలో భారత్‌లో 150 మంది అత్యుత్తమ కార్పొరేట్ దిగ్గజాలతో ఆయన సమావేశమౌతారు. ఈ కార్యక్రమాన్ని సీఐఐ నిర్వహించనుంది. సత్య నాదెళ్ల తెలుగు వాడైన విషయం తెలిసిందే. అతను హైదరాబాదులో జన్మించారు.
కాగా, టెక్నాలజీ దిగ్గజం యాపిల్ సీఈవో టిమ్ కుక్ భారత్‌లో పర్యటించిన విషయం తెలిసిందే. ఆయన గురువారం హైదరాబాదుకు వచ్చారు.

ఈ సందర్భంగా తన కొత్త ఐఫోన్ల తయారీ పరిశ్రమను తెలంగాణలో ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావు ఆ సంస్థ సీఈఓ టిమ్ కుక్‌ను కోరారు. దీనికి ప్రభుత్వపరంగా అన్ని విధాల సహకరిస్తామని చెప్పారు.
యాపిల్ మ్యాప్‌ల అభివృద్ధి కేంద్రం కోసం సొంత ప్రాంగణాన్ని ఏర్పాటు చేసేందుకు భూమిని ఇస్తామని, మౌలిక సదుపాయాలను కల్పిస్తామని తెలిపారు. హైదరాబాద్‌లోని ఇంక్యుబేటర్, టీహబ్‌లలో ఆ సంస్థ భాగస్వామి కావాలని కోరారు.
హైదరాబాద్‌లోని నానక్‌రాంగూడలోని వేవ్‌రాక్ బిల్డింగ్‌లో యాపిల్ మ్యాప్‌ల అభివృద్ధి కేంద్రంను ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు, ఆపిల్ సీఈవో టిమ్ కుక్ కలిసి ప్రారంభించారు. రాష్ట్ర ఐటీ శాఖమంత్రి కే తారకరామారావు కార్యక్రమంలో పాల్గొన్నారు. సీఎం ఆయనతో మాట్లాడుతూ.. మ్యాప్‌ల అభివృద్ధి కేంద్రం కోసం తెలంగాణను ఎంచుకున్నందుకు కృతజ్ఞతలు తెలిపారు.












Click it and Unblock the Notifications