• search
 • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

'పంజ్‌షీర్‌'పై బిగ్ ట్విస్ట్-జాతీయ తిరుగుబాటుకు పిలుపు-ఆఫ్గన్‌లో అమెరికా సైన్యం మళ్లీ అడుగుపెట్టనుందా?

|

పంజ్‌షీర్‌ను జయించేశామని తాలిబన్లు ప్రకటించుకున్నారు.నిజానికి గత రెండు రోజులుగా తాలిబన్ ప్రతినిధుల నుంచి పలుమార్లు ఈ ప్రకటన వెలువడింది. ప్రకటన వెలువడటమే కాదు... సంబరాలు కూడా జరుపుకుంటున్నారు.మరోవైపు పంజ్‌షీర్ తిరుగుబాటు దళం ఈ ప్రకటనను ఖండిస్తూ వస్తోంది. తాజాగా పంజ్‌షీర్ నాయకుడు అహ్మద్ మసౌద్ తాలిబన్ల గెలుపు ప్రకటనను ఖండించారు. తాలిబన్లతో పంజ్‌షీర్ దళం అజేయంగా పోరాడుతోందని ప్రకటించి ట్విస్ట్ ఇచ్చారు. తమ చివరి రక్తపు బొట్టు వరకూ పోరాటం కొనసాగుతుందని స్పష్టం చేశారు. పంజ్‌షీర్ తిరుగుబాటు దళ ప్రతినిధి ఫహీం దష్టీని తాలిబన్లు హత్య చేసినట్లుగా వార్తలు వచ్చిన కొద్ది గంటలకే మసౌద్ నుంచి ఈ ప్రకటన రావడం గమనార్హం.

టార్గెట్ సెక్స్ వర్కర్స్-పోర్న్ సైట్లు జల్లెడ పడుతున్న తాలిబన్లు-జాబితా సిద్ధమయ్యాక బహిరంగ శిరచ్చేదనం...టార్గెట్ సెక్స్ వర్కర్స్-పోర్న్ సైట్లు జల్లెడ పడుతున్న తాలిబన్లు-జాబితా సిద్ధమయ్యాక బహిరంగ శిరచ్చేదనం...

జాతీయ తిరుగుబాటుకు పిలుపు...

పంజ్‌షీర్ నాయకుడు అహ్మద్ మసౌద్ జాతీయ తిరుగుబాటుకు పిలుపునిచ్చారు.ఈ మేరకు అంతర్జాతీయ మీడియాకు ఆయన ఓ ఆడియో సందేశం పంపించారు.'దేశం వెలుపల ఉన్నా... దేశం లోపల ఉన్నా... మీరెక్కడున్నా సరే... ఆఫ్గనిస్తాన్ ఆత్మగౌరవం,స్వేచ్చ,శ్రేయస్సు కోసం జాతీయ తిరుగుబాటును ప్రారంభించాలని నేను పిలుపునిస్తున్నాను.' అని అహ్మద్ మసౌద్ పేర్కొన్నారు. 'మీ దేశం కోసం,మీ ఆత్మగౌరవం కోసం,మీ మతం కోసం పోరాడటం కన్నా గౌరవప్రదమైన విషయం మరొకటి ఉండదు.బాల్క్ నుంచి పంజ్‌షీర్ వరకూ ప్రజలు తాలిబన్లపై తిరగబడుతున్నారు. తాలిబన్లు మన కుటుంబాలను చంపేందుకు బయలుదేరారు. ఇంటింటికీ తిరుగుతూ లేదా పంజ్‌షీర్‌లో...' అంటూ అహ్మద్ మసౌద్ పేర్కొన్నారు.

Ganesh Chaturthi: దేశమంతటా గణేష్ విగ్రహాల తయారి.. భక్తుల కోలాహలం మొదలైంది (ఫొటోస్)

పాకిస్తాన్ జెట్ ఫైటర్స్ బాంబుల వర్షం..

పాకిస్తాన్ జెట్ ఫైటర్స్ బాంబుల వర్షం..


ఆఫ్గనిస్తాన్‌లో తాలిబన్ల ఆక్రమణను పాకిస్తాన్ మొదటి నుంచి సమర్థిస్తోన్న సంగతి తెలిసిందే. పంజ్‌షీర్‌పై తాలిబన్ల దండయాత్రకు కూడా పాకిస్తాన్ సహకరిస్తోందని అహ్మద్ మసౌద్ ఆరోపించారు.పంజ్‌షీర్‌పై పాకిస్తానీ ఫైటర్ జెట్స్ బాంబుల వర్షం కురిపిస్తున్నాయన్నారు. పంజ్‌షీర్ తిరుగుబాటును అణచివేసేందుకు పాకిస్తాన్ శతవిధాలా ప్రయత్నిస్తోందని అన్నారు. ఏదేమైనా తాలిబన్లు ఏమీ మారలేదనే విషయం ప్రస్తుత పరిణామాలను బట్టి అర్థమవుతోందన్నారు. తాలిబన్లు ఆఫ్గన్లు కాదని... వారెప్పుడూ బయటి దేశాల కోసమే పనిచేస్తారని ఆరోపించారు. మిగతా ప్రపంచంతో ఆఫ్గనిస్తాన్‌ను ఎడబాపడానికే దేశాన్ని హస్తగతం చేసుకున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తాలిబన్లపై తిరుగుబాటులో ప్రతీ పౌరుడు ముందుకు రావాలని పిలుపునిచ్చారు.

అమెరికా మళ్లీ అడుగుపెడుతుందా...

అమెరికా మళ్లీ అడుగుపెడుతుందా...

ఆఫ్గనిస్తాన్‌లో తాలిబన్లు ప్రభుత్వ ఏర్పాటు దిశగా కదులుతున్న తరుణంలో అమెరికా సంచలన ప్రకటన చేసింది. యూఎస్ రిపబ్లికన్ సెనేటర్ లిండ్సే గ్రహం బీబీసీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో సంచలన వ్యాఖ్యలు చేశారు. అమెరికా సేనలు మళ్లీ ఆఫ్గన్ గడ్డపై అడుగుపెడుతాయన్నారు. గతంలో ఎలాగైతే ఇరాక్,సిరియా దేశాల్లో అమెరికా దళాలు అడుగుపెట్టాయో... అదే తరహాలో భవిష్యత్తులో ఆఫ్గనిస్తాన్‌లో మళ్లీ అడుగుపెడుతారని అన్నారు. ఆఫ్గనిస్తాన్ నుంచి అమెరికాకు భారీ ముప్పు పొంచి ఉన్నందునా ఇది తప్పదన్నారు. ఆఫ్గనిస్తాన్ నుంచి అమెరికా దళాలను ఉపసంహరించడాన్ని రిపబ్లికన్లు మొదటి నుంచి తప్పు పడుతూనే ఉన్నారు.అధ్యక్షుడు బైడెన్ నిర్ణయాన్ని వారు పిరికిపంద చర్యగా అభివర్ణించారు. మరోవైపు బైడెన్ మాత్రం... తమది కాని యుద్ధంలో ఇప్పటివరకూ తమ సైనికులను పోగొట్టుకున్నది ఇక చాలునని.. ఆఫ్గన్ నుంచి సైన్యం ఉపసంహరణకు సరైన సందర్భమంటూ ఏదీ ఉండదని పేర్కొన్నారు. తన నిర్ణయాన్ని ఆయన సమర్థించుకున్నారు.

భిన్నాభిప్రాయాలు

భిన్నాభిప్రాయాలు

ఆఫ్గనిస్తాన్‌లో తాలిబన్ల పాలనపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ముఖ్యంగా కాబూల్ నగరంలోని ప్రజలు,గ్రామీణ ప్రాంతాల్లోని ప్రజల అభిప్రాయాల్లో స్పష్టమైన తేడా కనిపిస్తోంది. కాబూల్ నగరంలోని ప్రజలు ఎప్పుడు ఏం జరుగుతుందోనన్న భయంతో... భవిష్యత్తుపై తీవ్ర ఆందోళనతో బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. ఐసిస్ ఉగ్రవాదులు కాబూల్‌ను పదేపదే టార్గెట్ చేస్తుండటంతో ప్రతీ క్షణం వారిని భయం వెంటాడుతోంది.మరోవైపు కొన్నిచోట్ల గ్రామీణ ప్రాంత ప్రజలు.. తాలిబన్ల పాలనను స్వాగతిస్తున్నారు. అమెరికా ఆఫ్గనిస్తాన్ నుంచి వెళ్లిపోవడంతో... యుద్ధానికి తెరపడిందని అంటున్నారు. తద్వారా దేశంలో శాంతి నెలకొనడానికి ఆస్కారం ఏర్పడిందని అంటున్నారు. యుద్ధం కారణంగా వేల మంది తమవాళ్లను కోల్పోయామని... ఇక అలా జరగబోదని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. అయితే ప్రస్తుతం అన్నింటి ధరలు పెరిగిపోయాయని.. అదొక్కటే కాస్త ఆందోళన కలిగిస్తోందని అంటున్నారు. బీబీసీ ద్వారా ఈ విషయాలు వెలుగులోకి వచ్చాయి. అయితే గ్రామీణ ప్రాంతాల్లోనూ పురుషుల అభిప్రాయాలే బయటకొస్తున్నాయి తప్ప మహిళల దృక్పథం ఎలా ఉందన్నది తెలియట్లేదు.

పంజ్‌షీర్‌పై దాడిని ఖండించిన ఇరాన్...

పంజ్‌షీర్‌పై దాడిని ఖండించిన ఇరాన్...

ఆఫ్గనిస్తాన్‌లో తాలిబన్ల పాలనను మొదట సమర్థించిన ఇరాన్ ఇప్పుడు అందుకు భిన్నంగా స్పందిస్తోంది. పంజ్‌షీర్‌పై తాలిబన్ల దండయాత్రను ఇరాన్ ఖండించింది. ఇది చాలా బాధకరమని... పంజ్‌షీర్‌పై తాలిబన్ల దాడులను ఖండిస్తున్నామని తెలిపింది. ఈ మేరకు ఇరాన్ విదేశాంగ మంత్రి సయిద్ ఖతీబ్జదేమ్ ఒక ప్రకటన చేశారు. అంతకుముందు,ఇరాన్‌లో ప్రజాస్వామ్యాన్ని నెలకొల్పేందుకు ఎన్నికలు నిర్వహించాలని సూచించిన సంగతి తెలిసిందే. ప్రజలు ఓటు ద్వారా నాయకులను ఎన్నుకునే అవకాశం కల్పించాలని ఇరాన్ అభిప్రాయపడింది.

  Taliban Is All Set To Form New Government In Afghanistan, Russia China And Pak Among Invitees
  త్వరలో ప్రభుత్వ ఏర్పాటు...

  త్వరలో ప్రభుత్వ ఏర్పాటు...

  ఆఫ్గనిస్తాన్‌లో గత వారమే తాలిబన్ల ప్రభుత్వం ఏర్పాటు కావాల్సి ఉన్నా కొన్ని కారణాలతో అది వాయిదా పడింది. అయితే తాలిబన్లకు,అందులో భాగమైన హక్కనీ నెట్‌వర్క్ మధ్య నెలకొన్న విభేదాలే ఇందుకు కారణమనే వాదన వినిపిస్తోంది. ప్రభుత్వంలో కీలక పదవుల కోసం హక్కనీ నెట్‌వర్క్ పట్టుబడుతుండటంతో దీనిపై చర్చలు జరుగుతున్నట్లు తెలుస్తోంది. ఇటీవలి చర్చల్లో ఇరువర్గాలు ఘర్షణ పడ్డారనే వార్తలు కూడా వచ్చాయి. త్వరలోనే ప్రభుత్వ ఏర్పాటు జరగవచ్చుననే వార్తలు వస్తున్నాయి. ఇప్పటికే కాబూల్ వీధుల్లోని గోడలపై తాలిబన్ల రాతలు కనిపిస్తున్నాయి. రంగు రంగుల గోడలకు తెల్ల సున్నం వేసి తాలిబన్ల కొటేషన్లను వాటిపై రాస్తున్నారు.

  English summary
  The Taliban have claimed control of Panjshir. Not only the announcement but also the celebrations are going on. On the other hand the Panjshir resistance force has been condemning this statement. Latestly, Panjshir leader Ahmed Masood condemned the Taliban's declaration of victory and called for national uprising against taliban
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X