Canada: కెనడాలో అదృశ్యమవుతున్న పాక్ ఎయిర్ హోస్టెస్‌లు.. మిస్టరీగా మిస్సింగ్ కేసులు..!
విమానాయన సంస్థలో గగన సఖిలుగా పని చేస్తున్న(ఎయిర్ హోస్టెస్‌లు) వరుసగా అదృశ్యమవుతుండడంతో కలకలం రేగింది. అది కెనడాలోనే అదృశ్యమవడం పలు సందేహాలకు కారణమవుతోంది. అది కూడా పాకిస్థాన్ కు చెందిన ఇంటర్నేషనల్ ఎయిర్ లైన్స్ చెందిన ఎయిర్ హోస్టెస్‌లు కావడం మరింత చర్చకు దారి తీస్తోంది. అదృశ్యమైనవారు ఎటు వెళ్లారు అనే దానిపై ఎవరు సమాధానం చెప్పలేకపోతున్నారు. హోస్టెస్‌ల అదృశ్యం వెనక ఏమైన మిస్టరీ ఉందా అనే అనుమానాలు వస్తున్నాయి.
పాకిస్థాన్ ఇంటర్నేషనల్ ఎయిర్ లైన్స్ కు చెందిన ఓ హోస్టెస్ జనవరిలో అదృశ్యమయ్యారు. ఇప్పుడు మరో ఎయిర్ హోస్టెస్ కూడా కనిపించకుండా పోయారు. కొద్ది రోజుల క్రితం పాకిస్థాన్ లోని ఇస్లామాబాద్ నుంచి పీకే-782 విమానం కెనడాకు వెళ్లింది. ఇందులో మరియం రజా అనే మహిళ ఎయిర్ హోస్టస్ గా వెళ్లింది. విమానం కెనడాలోని టొరంటోలోని విమానాశ్రయంలో దిగింది. ఆ విమానం తర్వాతి రోజు పాకిస్థాన్ లోని కరాచీకి రావాలి. మరియం రాజా కూడా అదే సెక్టర్ లో రావాలి.

కానీ విమానం స్టార్ట్ అయినా కూడా ఆమె రాలేదు. దీంతో అధికారులు వెంటనే ఆమె ఉన్న హోటల్ గదికి వెళ్లారు. అక్కడ సోదాలు నిర్వహించారు. ఈ క్రమంలో ఎయిర్ హోస్టెస్ యూనిఫామ్ తోపాటు ఓ లేఖ లభించింది. అందులో ధన్యవాదాలు పాకిస్థాన్ ఇంటర్నేషనల్ ఎయిర్ లైన్స్ అని రాసి ఉంది.మరియం రజా 15 సంవత్సరాలుగా పీఐఏలో పని చేస్తున్నట్లు ఎయిర్ లైన్స్ అధికారులు తెలిపారు. గత సంవత్సరం నుంచి ఇప్పటి వరకు పాకిస్థాన్ కు చెందిన 9 మంది ఎయిర్ హోస్టస్ లు కెనడాలో అదృశ్యమయ్యారు.
కాగా ఇదే ఎయిర్ లైన్స్ చెందిన 7గురు ఎయిర్ హోస్టస్ లు కెనడాలో కనిపించకుండా పోయారు. పాకిస్థాన్ ఎయిర్ హోస్టస్ లు కనిపించకుండా పోవడం 2019 నుంచి జరుగుతుందట. వీరు ఏదైనా ఉగ్రవాద సంస్థలోకి వెళ్తున్నారా అనుమానాలు కూడా వచ్చాయి. కానీ కెనడాలో స్థరపడేందుకు వారు కనిపించకుండా పోతున్నారని చెబుతున్నారు. కొన్ని సంవత్సరాల క్రితం ఓ ఎయిర్ హోస్టస్ కనిపించకుండా పోయి కెనడాలో స్థిరపడినట్లు వార్తలు వచ్చాయి. ఆమె దారిలో మిగతా వారు కూడా వెళ్లిపోయినట్లు తెలుస్తోంది.
పాకిస్థాన్ లో పరిస్థితులు బాగాలేకపోవడంతో కెనడా స్థిరపడాలని ఎయిర్ హోస్టస్ లు ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఎందుకంటే కెనడాలో నివాస నిబంధలను సరళంగా ఉంటాయని చెబుతున్నారు.
-
అప్పటి వరకూ పాకిస్థాన్ కు నో వాటర్: భారత్ సంచలనం -
ఇరాన్ పై దాడికి పాకిస్తాన్ ? తెరపైకి సౌదీతో రక్షణ ఒప్పందం..! -
స్టేడియం ఖాళీ.. కుర్చీలు ఫుల్! పీఎస్ఎల్ అంటే ఇదేనా నాయనా? -
పాతాళానికి బంగారం ధరలు- రంజాన్ పండగ వేళ -
తమిళనాడులో ఆ పార్టీదే అధికారం: విజయ్ రాకతో మారిన ఈక్వేషన్లు -
40 ఏళ్లలో లేని అతిపెద్ద పసిడి పతనం. 1983 సీన్ రిపీట్! -
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
బంగాళాఖాతంపై ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు -
తిరుమలలో సీఎం చంద్రబాబుకు భక్తుల స్పెషల్ రిక్వెస్ట్, అక్కడే ఆదేశాలు..!! -
ఎట్టకేలకు జీవన్ రెడ్డి చేరే పార్టీ ఖరారు, అదే బాటలో..!! -
రామ్ చరణ్ బర్త్ డేకు బిగ్ సర్ ప్రైజ్: `పెద్ది` నుంచి -
త్వరలో తిరుపతి, హైదరాబాద్కు నేరుగా రైళ్లు: ఆ జిల్లాకు కేంద్రమంత్రి తీపికబురు!












Click it and Unblock the Notifications