అర్దరాత్రి 2గం.: ఆ మోత భరించలేక తలుపులు బద్దలు కొట్టి, లోపల ఉన్నది చూశాక!..

Subscribe to Oneindia Telugu

బెర్లిన్: జర్మనీ లోని పైన్‌బెర్గ్‌ నగరంలో అర్దరాత్రి ఓ అపార్ట్ మెంట్ ఫ్లాట్ నుంచి భారీ సౌండ్ తో సాంగ్స్ ప్లే అయ్యాయి. ఆ మోత భరించలేక ఇరుగుపొరుగువారు జాగారం చేయాల్సిన పరిస్థితి తలెత్తింది.

రోజూ ఇదే తంతు జరుగుతుండటంతో.. చూసీ చూసీ విసిగిపోయిన చుట్టుపక్కలవాళ్లు.. పోలీసులకు ఫిర్యాదు చేశారు. తీరా పోలీసులు వచ్చి.. తలుపులు బద్దలు కొట్టి చూసి ఆశ్యర్యపోయారు. ఎందుకంటే.. లోపల అసలు మనుషులే లేరు. మరి మ్యూజిక్ ఎలా ప్లే అయింది?

ఎలా అంటే ఫ్లాట్ లోపల ఓ మూలకు 'అలెక్సా(ఇంటలిజెన్స్ పర్సనల్ అసిస్టెంట్-మ్యూజిక్ డివైస్) ఉంది.మనుషుల కమాండ్స్ ఆధారంగా.. నెట్‌లో సెర్చ్ చేసి.. ఆటోమేటిగ్గా పాటలను ప్లే చేయడం దీని స్పెషాలిటీ. మరోవైపు అమెజాన్ మాత్రం ఆ ఇంటి ఓనర్ ఆలివరే దాన్ని రిమోట్ ద్వారా యాక్సెస్ చేసి ఉంటాడన్న అనుమానాలను వ్యక్తం చేస్తోంది.

Alexa, Nein! Police break into German man's house after music device 'held party on its own'

మొత్తం మీద పోలీసులు మాత్రం అలెక్సా పవర్ ఆఫ్ చేసి.. ఆ ఇంటికి కొత్త తాళాలు వేసి వెళ్లిపోయారు. ఆ తర్వాత ఇంటికొచ్చిన ఆలీవర్.. కొత్త తాళాలు చూసి ఆశ్చర్యపోయాడు. జరిగిన విషయం తెలుసుకుని.. దాన్నంతా తన ఫేస్ బుక్ ఖాతాలో రాసుకొచ్చాడు.

అర్దరాత్రి 2గం. సమయంలో ఆటోమేటిగ్గా అలెక్సా సాంగ్స్ ప్లే చేయడంతో ఇరుగుపొరుగువాళ్లంతా ఇంట్లో ఏదో పార్టీ జరుగుతుందనుకున్నారని తెలిపాడు. అయితే అంతకంతకూ శబ్దం పెరిగిపోవడంతో వారు పోలీసులను ఆశ్రయించాడని పేర్కొన్నాడు. మొత్తం మీద జర్మనీలో ఇప్పుడిదో హాట్ టాపిక్ గా మారిపోయింది.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
A man in Germany is facing a hefty bill for a night out — after his Alexa device decided to hold a party on its own while he was away.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి