నరేంద్ర మోడీ వీసా రికార్డులివ్వండి: అమెరికాకు కోర్టు

న్యూయార్క్: భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ వీసా రికార్డులు ఇవ్వాలని అమెరికా విదేశాంగ శాఖను న్యాయస్థానం ఆదేశించింది. ప్రధాని మోడీ అమెరికాలో ప్రవేశించకుండా ఉన్న నిషేధాన్ని ఎత్తివేస్తూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి సంబంధించిన పత్రాలను వచ్చే ఫిబ్రవరిలోగా సమర్పించాలని చెప్పింది.

2013 జూన్ నుంచి అమెరికాలో ప్రధాని మోడీ ప్రవేశం, వీసాకు సంబంధించిన రికార్డులను సమర్పించాలని సిక్స్ ఫర్ జస్టిస్ (ఎస్ఎఫ్‌జే) అనే సంస్థ సమాచార స్వేచ్ఛా హక్కు చట్టం కింద అమెరికా విదేశాంగ శాఖను కోరింది. రికార్డులు ఇవ్వడంలో అది విఫలం చెందడంతో ఆ సంస్థ కోర్టుకు ఎక్కింది.

American court asks for PM Narendra Modi's US visa records by February

భారత్‌పై టైమ్ మేగజిన్ ప్రశంస

ప్యారిస్‌లో జరుగుతున్న అంతర్జాతీయ వాతావరణ మార్పుల చర్చలో భారత్‌ది కీలక పాత్ర అని టైమ్ మేగజైన్ పత్రిక కొనియాడింది. హానికర ఉద్గారాలు, నిధులు అందించే విషయంలో వెనక్కి తగ్గడానికి నిరాకరిస్తున్న సంపన్న దేశాల పైన భారత్ విరుచుకుపడిందని పేర్కొంది.

ఆ దేశాలు పట్టువిడుపు ధోరణిని ప్రదర్శించడం లేదని, సమగ్ర వాతావరణ ఒప్పందానికి అడ్డంకులు సృష్టిస్తున్నాయని ఆరోపించినట్లు తెలిసిందని, ప్రపంచంలోనే నాలుగో పెద్ద ఉద్గార దేశంగా ఉన్న భారత్... అంతర్జాతీయ వాతావరణ చర్చల్లో నిర్మాణాత్మక పాత్రకు సిద్ధమన్న సంకేతాన్ని ఇవ్వాలన్నది ఆ దేశం ఉద్దేశ్యమని తెలిపింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+