మరోసారి భూకంపం..!!

Pakistan earthquake 2025: భారత్‌కు పొరుగునే ఉన్న మయన్మార్, థాయ్‌లాండ్‌లల్లో సంభవించిన భూకంపం మిగిల్చిన ప్రాణ, ఆస్తినష్టం అంతా ఇంతా కాదు. నిమిషాల వ్యవధిలో సంభవించిన పెను భూకంపాలు ఈ రెండు దేశాలను కుదిపిపడేశాయి. కోలుకోలేని విధంగా దెబ్బకొట్టాయి.

ఈ ప్రకృతి విపత్తు బారిన పడి 2,700 మంది వరకు దుర్మరణం పాలయ్యారు. అనేక భవనాలు పేకమేడల్లా కూలిపోయాయి. పలువురు వాటి శిథిలాల కింద చిక్కుకుని కన్నుమూశారు. భవనాల శిథిలాలను తొలగిస్తోన్న కొద్దీ మృతదేహాలు బయటపడుతున్నాయి. ఫలితంగా మృతుల సంఖ్య మరింత పెరగవచ్చని, 3,000లను దాటుతుందనే అంచనాలు ఉన్నాయి.

An earthquake with a magnitude of 4 3 struck Pakistan

అదే సమయంలో- పొరుగుదేశం పాకిస్తాన్‌లో భూకంపం సంభవించింది. ఇప్పటివరకు దీనివల్ల సంభవించిన ప్రాణ, ఆస్తి నష్టాల వివరాలు ఇంకా తెలియరాలేదు. దీని తీవ్రత అటు ఆఫ్ఘనిస్తాన్‌లోనూ కనిపించింది. దీని తీవ్రత రిక్టర్ స్కేలుపై 4.3గా రికార్డయింది. ఈ తెల్లవారు జామున సరిగ్గా 2:58 నిమిషాలకు భూమి కంపించింది.

రాజధాని ఇస్లామాబాద్‌కు వాయవ్యం, ముల్తాన్‌కు ఆగ్నేయ దిశగా ఆఫ్ఘనిస్తాన్ సరిహద్దులకు ఆనుకుని ఉన్న బలూచిస్తాన్ ప్రావిన్స్‌ పరిధిలోకి వచ్చే జోభ్ ప్రాంతాన్ని భూకంప కేంద్రంగా గుర్తించారు. భూ ఉపరితలం నుంచి 80 కిలోమీటర్ల లోతున టెక్టానిక్ ప్లేట్స్‌లల్లో చోటు చేసుకున్న పెను కదలికల వల్ల భూమి ప్రకోపించినట్లు నేషనల్ సెంటర్ ఫర్ సెస్మాలజీ వెల్లడించింది.

భూకంపం సంభవించిన వెంటనే స్థానికులు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు. ఇళ్లల్లో నుంచి బయటికి పరుగులు తీశారు. ప్రధాన భూకంపం తరువాత కూడా స్వల్ప స్థాయిలో ప్రకంపనలు సంభవించడం వల్ల ఇళ్లల్లోకి వెళ్లడానికి వెనుకాడారు. ఈ భూకంపం వల్ల ప్రాణనష్టం సంభవించినట్లు ఇప్పటివరకు సమాచారం అందలేదు.

చెప్పుకోదగ్గ స్థాయిలో ఆస్తినష్టం చోటు చేసుకున్నట్లు తెలుస్తోంది. కొన్ని చోట్ల ఇళ్లు బీటలు వారినట్లు వార్తలొస్తోన్నాయి. కాగా ఈ భూకంప తీవ్రత ఆఫ్ఘనిస్తాన్‌లోనూ కనిపించింది. సరిహద్దులను పంచుకుంటోన్న ప్రాంతం కావడం వల్ల కొన్నిచోట్ల ప్రకంపనలు నమోదయ్యాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+