అమెరికాలో మరో హిందూ దేవాలయంపై దాడి, ఎఫ్‌బీఐకి ఫిర్యాదు
లాస్ ఏంజిల్స్: అమెరికాలో మరోసారి హిందూ దేవాలయం పైన దాడి జరిగింది. గత కొద్ద రోజుల్లో దేవాలయం పైన దాడి జరగడం ఇది రెండోసారి. దక్షిణ సియాటిల్‌లోని కెంట్ శివారు ప్రాంతంలో ఉన్న కెంట్ హిందూ ఆలయాన్ని దుండగులు ధ్వంసం చేశారు.

ఇటుకలతో గుడి కిటికీలను ధ్వంసం చేశారు. ఆలయ గోడపై ఫియర్ అని ఆంగ్లంలో రాశారు. గత గురువారం రాత్రి ఈ ఘటన జరిగినట్లుగా సమాచారం. దాడి ఘటనకు సంబంధించి ఎఫ్‌బీఐతో పాటు కెంట్ పోలీసులకు తెలియజేశారు. పలువురు భక్తులు పూజ కోసం వచ్చిన సమయంలో ఈ దాడిని గుర్తించి, పోలీసులకు సమాచారం అందించారు.
ఫిబ్రవరి నెలలో సియాటల్ శివారు ప్రాంతం బోతెల్‌లో కూడా హిందూ ఆలయంపై దాడి జరిగిన విషయం తెలిసిందే. స్వస్తిక్‌తో పాటు గెట్ అవుట్ అని ఆలయ గోడలకు రాశారు. వరుసగా హిందూ దేవాలయాల పైన దాడులు అమెరికాలోని హిందువులకు ఆందోళన కలిగిస్తున్నాయి.












Click it and Unblock the Notifications