చంద్రుడి మీద అడుగుపెట్టిన చివరి వ్యోమగామి కన్నుమూత..
సెర్నాన్ మొత్తం మూడుసార్లు అంతరిక్ష యానానికి సారథిగా వ్యవహరించారు. చంద్రుడిపై కాలు మోపిన చివరి వ్యక్తి సెర్నాన్ మరణించడం తీవ్ర విచారానికి గురిచేస్తోందని అమెరికా అంతరిక్ష పరిశోధన కేంద్రం ట్విట్టర్ ద్వా
వాషింగ్టన్: చంద్రుడిపై పాదం మోపిన చివరి వ్యోమగామి యూజీన్ సెర్నాన్ కన్నుమూశారు. 82ఏళ్ల ఆయన సోమవారం మృతి చెందినట్టు ఆయన కుటుంబ సభ్యులు తెలిపారు. ఆయన మృతిని నాసా కూడా ధ్రువీకరించింది.
కాగా, 'అపొల్లో 17' అంతరిక్ష నౌకకు సెర్నాన్ కమాండర్‌గా పనిచేశారు. డిసెంబర్ 1972లో దీన్ని చంద్రుడిపైకి పంపించగా.. చంద్రుని మీదకు అమెరికా పంపిన చివరి మానవ సహిత మిషన్ ఇదే కావడం గమనార్హం.

సెర్నాన్ మొత్తం మూడుసార్లు అంతరిక్ష యానానికి సారథిగా వ్యవహరించారు. చంద్రుడిపై పాదం మోపిన చివరి వ్యక్తి సెర్నాన్ మరణించడం తీవ్ర విచారానికి గురిచేస్తోందని అమెరికా అంతరిక్ష పరిశోధన కేంద్రం ట్విట్టర్ ద్వారా వెల్లడించింది.
ఇటీవలి కాలంలో తరుచుగా అనారోగ్యానికి గురికావడం వల్లే సెర్నాన్ మృతి చెందినట్లుగా ఆయన కుటుంబ సభ్యులు తెలిపారు.












Click it and Unblock the Notifications