వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఇదేం పిచ్చిరా బాబు.. రూ.1.7 కోట్లకు స్టీవ్ జాబ్స్ చెప్పులు సొంతం చేసుకున్న వ్యక్తి..

|
Google Oneindia TeluguNews

Apple కంపెనీ సహ వ్యవస్థాపకుడు స్టీవ్ జాబ్స్ చెప్పులు $218,750 (సుమారు ₹1.7 కోట్లు)కి అమ్ముడుపోయాయి. 1970ల మధ్యకాలం నాటి స్టీవ్ జాబ్స్ ధరించిన బిర్కెన్‌స్టాక్ అరిజోనా బ్రౌన్ లెదర్ సాండల్స్ ను వేలంలో కోటీ 70 లక్షలకు కొనుగోలు చేశారు. అమెరికాలోని జూలియెన్స్ అనే కంపెనీ ఆదివారం వేలం పాట నిర్వహించింది. ఆ సాండల్స్ ని కాలిఫోర్నియాకు చెందిన ఓ వ్యక్తి 1.77 కోట్ల రూపాయలకు కొనుగోలు చేశాడు.

1976లో

1976లో


వేలం హౌస్ వెబ్‌సైట్‌లోని వివరాల ప్రకారం, స్టీవ్ జాబ్స్ Apple చరిత్రలో చాలా కీలకమైన సందర్భాలలో ఈ చెప్పులను ధరించారు. 1976లో, అతను Apple సహ వ్యవస్థాపకుడు స్టీవ్ వోజ్నియాక్‌తో కలిసి లాస్ ఆల్టోస్ గ్యారేజీలో అప్పుడప్పుడు ఈ చెప్పులు ధరించి Apple కంప్యూటర్‌ను ప్రారంభించారట. కొన్ని కీలకమైన మీటింగ్స్ కి కూడా ఈ చెప్పులు వేసుకునే వెళ్లాడని వివరాలు తెలిపింది జూలియెన్స్ కంపెనీ. ఇప్పటివరకు అమెరికాలోని చాలా ఎగ్జిబిషన్స్ లో ఈ చెప్పుల్ని డిస్ ప్లేకి ఉంచారు.

IMM కోల్న్

IMM కోల్న్


2017లో ఇటలీలోని మిలానోలోని సలోన్ డెల్ మొబైల్‌తో పాటు, 2017లో జర్మనీలోని రహమ్స్‌లోని బిర్కెన్‌స్టాక్ ప్రధాన కార్యాలయంలో, న్యూయార్క్‌లోని సోహోలోని బిర్కెన్‌స్టాక్ యొక్క మొదటి యునైటెడ్ స్టేట్స్ స్టోర్‌లో, అనేక ప్రదర్శనలలో చెప్పులు ఒక భాగంగా ఉన్నాయి. IMM కోల్న్, జర్మనీలోని కొలోన్‌లో ఫర్నీచర్ ఫెయిర్, 2018లో డై జైట్ మ్యాగజైన్ కోసం జైట్ ఈవెంట్ బెర్లిన్, ఇటీవల జర్మనీలోని స్టట్‌గార్ట్‌లోని హిస్టరీ మ్యూజియం ఈ చెప్పులను ప్రదర్శించినట్లు వేలం హౌస్ పేర్కొంది.

NFT

NFT

ఆ చెప్పులు ఇప్పటికీ చెక్కుచెదరకుండా ఉన్నాయట. చెప్పులపై ఒరిజినల్ బిర్కెన్‌స్టాక్ అడ్జస్టబుల్ బకిల్స్, స్వెడ్ లెదర్ ఫుట్ స్ట్రాప్‌ల లోపలి అంచున బిర్కెన్‌స్టాక్ స్టాంపింగ్‌ను కలిగి ఉంటుందట. ఈ చెప్పులు USD 60,000 డాలర్లు వస్తాయని అంచనా వేశారు. కానీ NFTతో ఈ చెప్పలు USD 218,750 డాలర్లు పలికాయని జూలియెన్స్ కంపెనీ తెలిపింది.

English summary
Apple co-founder Steve Jobs' old shoes were sold at an auction for Rs 1.7 crore. The auction was conducted by a company called Juliens.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X