ఘోర రోడ్డు ప్రమాదం: 50మంది మృతి
నైరోబీ: కెన్యాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. నైరోబీ నుంచి కుసుము వెళ్తున్న బస్సు బోల్తా పడటంతో 50 మంది ప్రయాణికులు మృతి చెందారు. మరికొంతమంది తీవ్రంగా గాయపడ్డారు.

బస్సులో 70 మంది వరకు ప్రయాణికులు ఉన్నారని, డ్రైవర్ నిర్లక్ష్యంతో ప్రమాదం జరిగినట్లు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. ట్రాఫిక్ రూల్స్ పాటించకుండా డ్రైవర్ ఇష్టానుసారంగా బస్సును నడపటంతోనే ప్రమాదం చోటు చేసుకున్నట్లు చెప్పారు.
మృతుల్లో 12 మంది మహిళలు, ఏడుగురు చిన్నారులు ఉన్నారు. క్షతగాత్రులను ఆస్పత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు. కాగా, బస్సుకు ఎలాంటి లైసెన్సులు లేవని రవాణాశాఖ అధికారులు వెల్లడించారు. ఘటనపై దర్యాప్తు చేస్తున్నారు.












Click it and Unblock the Notifications